ఎంబీఏ చేసి, పారిశుద్ధ్య కార్మికురాలిగా ఎందుకు మారింది..? ఈ మహిళ కథ ఏంటంటే..?

ఎంబీఏ చేసి, పారిశుద్ధ్య కార్మికురాలిగా ఎందుకు మారింది..? ఈ మహిళ కథ ఏంటంటే..?

by kavitha

Ads

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగాన్ని సాధించడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఉన్నత చదువు పూర్తి చేసిన ఒక మహిళ ఆర్థిక సమస్యల వల్ల దొరికిన ఉపాధితో పంచాయితీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్నారు.

Video Advertisement

ఎంబీఏ పూర్తి చేసిన యువతి పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎంబీఏ చేసి, పారిశుద్ధ్య కార్మికురాలిగా చేయడం వెనుక గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఎంబీఏ చదివినా, అందుకు తగ్గ జాబ్ రాలేదని బాధపడకుండా మానస అనే మహిళ తనకు లభించిన ఉపాధితో  పారిశుద్ధ్య కార్మికురాలిగా వర్క్ చేస్తోంది. హన్మకొండ జిల్లా, వెంకటాపూర్ గ్రామానికి చెందిన మానస, డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటపుడు బంధువు అయిన దిలీప్ కుమార్ ను ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త కూడా ఎంబీఏ మార్కెటింగ్ పూర్తి చేశారు. 2016లో ఆమె ఎంబీఏను పూర్తి చేశారు. మంచి ఉద్యోగం సాధించి, మంచి జీవితాన్ని పొందాలనుకున్న మానస లైఫ్ లో కొన్ని పరిణామాలు జరిగాయి.
దాంతో ఆమె వెంకటాపూర్ పంచాయితీ ఆఫీస్ లో పారిశుద్ధ్య కార్మికురాలిగా, ఎనిమిది వేల రూపాయల జీతానికి పని చేస్తున్నారు. ఆమె భర్త దిలీప్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు.  అలా ఎంబిఎ చేసిన ఆ భార్యభర్తలు ఇద్దరు పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. మానస తండ్రి చనిపవడంతో, తల్లిని ఒంటరిగా వదిలేయలేక, ఆర్థిక పరిస్థితుల వల్ల సొంత గ్రామాన్ని వదల్లేక, ఇక్కడే ఉండిపోయామని మానస వెల్లడించారు. అక్కడే దొరికిన ఉపాధితో సంతోషంగా ఉన్నామని తెలిపారు.
ఇటీవల వచ్చిన పోలీస్ నోటిఫికేషన్ కు కూడా మానస దరఖాస్తు చేసింది. చాలా కష్టపడి పరీక్షలు రాసినప్పటికీ, ఆమె పోలీస్ సెలెక్షన్లలో సెలెక్ట్ కాలేదు. ఒక్క మార్కు తేడాతో ఉద్యోగాన్ని పొందలేకపోయానని మానస తెలిపారు. మానస తమ చదువుకు తగిన ఉద్యోగావకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వార్తను చూసిన నెటిజెన్లు ఎంబీఏ చదివి కూడా పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్న మానస పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: రేవంత్ రెడ్డి ఆఫర్ కి DSP నళిని బహిరంగ లేఖ..! ఏం అన్నారంటే..?

 


End of Article

You may also like