Ads
విక్టరీ వెంకటేష్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫ్యామిలీ సినిమాలతో కామెడీ సినిమాలతో తనకంటూ సెపరేట్ మార్కెట్ ను ఏర్పరచుకున్నారు.ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి వెంకటేష్ ఇండస్ట్రీలో అందరితో మంచి సంబంధాలు ఉంటాయి.
Video Advertisement
అయితే వివాదాలకు దూరంగా ఉండే వెంకీ సినిమాకి వివాదాలు వచ్చి పడ్డాయి. వెంకటేష్ నటించిన ఓ సినిమా రిలీజ్ కి ముందు కాంట్రవర్సీలో చిక్కుకుంది. కానీ రిలీజ్ అయ్యాక బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇంతకీ అది ఏ సినిమానో తెలుసా…?
వెంకటేష్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొండపల్లి రాజా’ సినిమా విడుదల తర్వాత పెద్ద వివాదమే క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మరో హీరోగా సుమన్ నటించారు. మరో కీలక పాత్రలో శ్రీకాంత్ నటించారు .కొండపల్లి రాజా సినిమా హిందీలో జితేంద్ర, శతృఘ్న సిన్హా హీరోలుగా నటించిన ‘ఖుద్‌గర్జ్’ సినిమాకు రీమేక్.ఆ తర్వాత ఈ సినిమాను కృష్ణంరాజు, శరత్ బాబు హీరోలుగా ప్రాణ స్నేహితులుగా తెరకెక్కింది. వి.మధుసూదన రావు డైరెక్ట్ చేశారు. అదే సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళంలో శరత్ బాబుతో కలిసి ‘అన్నామలై’గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.
అప్పట్లో ప్రాణ స్నేహితులు సినిమా హీరో కృష్ణంరాజు ఈ సినిమా తెరకెక్కించడానికి మా అనుమతి తీసుకోలేదని కోర్టుకు కెక్కారు. దీంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. ఆ తర్వాత చిత్ర నిర్మాతలు, ప్రాణ స్నేహితులు చిత్ర నిర్మాతలతో పాటు కృష్ణంరాజుతో రాజీకి రావడంతో ఈ సినిమా విడుదలకున్న అడ్డంకులు తొలిగిపోయాయి. తర్వాత వెంకీ సినిమా సూపర్ హిట్ అయింది
End of Article