పల్లవి ప్రశాంత్ చేసిన తప్పు ఏంటి..? అసలు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు..?

పల్లవి ప్రశాంత్ చేసిన తప్పు ఏంటి..? అసలు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు..?

by kavitha

Ads

బిగ్‏బాస్ సీజన్ 7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‏ను పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్ గూడ జైలుకు తరలించారు.  బుధవారం రాత్రి గజ్వేల్‏ మండలంలోని కొల్గూరులో పల్లవి ప్రశాంత్‏ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు, ప్రశాంత్ సొదరుడు మనోహర్ ను కూడా అరెస్ట్ చేశారు.

Video Advertisement

డిసెంబర్ 17న అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘర్షణల విషయం తెలిసిందే. బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే తరువాత విన్నర్ ప్రశాంత్‏ కోసం వందలాది మంది ఫ్యాన్స్ స్టూడియో దగ్గరకు చేరుకుని రోడ్డుపై న్యూసెన్స్ సృష్టించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఈనెల 17న అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. విజేతగా పల్లవి ప్రశాంత్, రన్నర్ గా అమర్‌దీప్ నిలిచారు. ఈ సందర్భంగా వారిని కలవడానికి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కు, అమర్‌దీప్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అమర్‌దీప్‌ కారుపై రాళ్లు విసిరారు.  మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అశ్విని, గీతూ రాయల్ కారు అద్దాలను పగలగొట్టారు. అంతేకాకుండా రోడ్డుపై ఉన్న ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేశారు.
అక్కడికి బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దం, బెటాలియన్ బస్సు అద్దాన్ని సైతం పగలగొట్టారు. దీంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈ దాడులకు కారణం పల్లవి ప్రశాంత్‌ అని తేల్చారు. చెప్పిన పట్టించుకోకుండా ఫ్యాన్స్ దగ్గరికి పల్లవి ప్రశాంత్ వెళ్లాడని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రశాంత్‌తో పాటుగా  ఇంకో నలుగురిపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో ఏ1, ఏ2 లుగా ఉన్న ప్రశాంత్, అతని సోదురుడిని అరెస్టు చేశారు. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏ3, ఏ4ల నిందితులను ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించారు. కాగా, పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ దాడి విషయంలో తన ప్రమేయం ఏం లేదని అన్నారు. ఫ్యాన్స్ తాను రెచ్చగొట్టలేదని వెల్లడించారు.

Also Read: DUNKI REVIEW : “షారుఖ్ ఖాన్” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like