Ads
తెలుగుతరపై ఎందరో మంది హీరోయిన్లు మెరుస్తూ ఉంటారు. చాలామంది అసలు పేరు కంటే కొసరి పేరు పెట్టుకుని ఫేమస్ అవుతూ ఉంటారు. అసలు పేరు ఇంకా ఏదో ఉన్నా స్వీట్ గా షార్ట్ గా జనానికి గుర్తుండిపోయే పేరు పెట్టుకుని క్రేజ్ తెచ్చుకుంటారు.
Video Advertisement
అయితే ఇప్పుడు సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తన ఇంటి పేరును మార్చేసుకుంది. ఇంతకీ ఎందుకు మార్చుకుంది అనే విషయంలోకి వెళ్తే..
లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.వీరి పెళ్లి ఇటలీలో ఘనంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. హైదరాబాదులో కూడా వీరి రిసెప్షన్ భారీగా ఏర్పాటు చేశారు. పెళ్లి అనంతరం లావణ్య వరుణ్ తేజ్ తో కలిసి హైదరాబాదులోనే నివసిస్తుంది.
వరుణ్ తేజ్ యధావిధిగా తన షూటింగ్లకు హాజరైపోతున్నాడు అయితే లావణ్య మాత్రం సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది మెగా ఇంటి కోడలు అయిన తర్వాత ఆ ఇంటి పద్ధతులను పాటిస్తూ అందరిని పొందుతుంది అయితే ఇప్పుడు లావణ్య సోషల్ మీడియాలో తన పేరు చివర్న కొణిదల అని ఇంటిపేరును చేర్చుకుంది. సాధారణంగా తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లయిన తర్వాత భర్త ఇంటి పేరు వచ్చి చేరుతుంది. అదే పద్ధతిని ఇప్పుడు లావణ్య కూడా పాటించింది.ఇది చూసి అందరూ కొణిదల వారి కోడలు అంటూ కామెంట్లు పెడుతున్నారు
End of Article