హిందీ బేబీ పట్టాలెక్కేది అప్పుడేనా…? నటీనటులు ఎవరంటే…!

హిందీ బేబీ పట్టాలెక్కేది అప్పుడేనా…? నటీనటులు ఎవరంటే…!

by Mounika Singaluri

Ads

చిన్న సినిమాగా విడుదలై తెలుగులో పెద్ద సంచలనం సృష్టించిన మూవీ బేబీ. యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ సంచలన విజయాం నమోదు చేసుకుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వీరాజ్ అశ్విన్ ,వైష్ణవి చైతన్యాలు నటీనటులుగా నటించారు.

Video Advertisement

ఈ సినిమా టీం అందరికీ బేబీ సక్సెస్ మంచి బూస్ట్ అప్ ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కెరీర్ వేగం పుంజుకుంది. ప్రముఖ నిర్మాత ఎస్.కే.ఎన్ ఈ సినిమా నిర్మించారు. బేబీ సినిమా ని చూసి మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ లాంటి వారు సైతం అభినందనలతో ముంచెత్తారు.

అయితే బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఒక కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు. నిర్మాత ఎస్.కే.ఎన్ దానికి తగ్గ సన్నహాలు చేస్తున్నారని నిర్మాతగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. బేబీ వచ్చి చాలా రోజులు అయింది, రీమేక్ ప్రకటన వచ్చి కూడా చాలా రోజులు అయింది. ఇప్పటి వరకు ఎప్పుడు రీమేక్ పనులు మొదలు అయ్యేది లేనిది క్లారిటీ లేకపోవడంతో అసలు రీమేక్ ఉందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్మాత ఎస్‌.కే.ఎన్ బేబీ రీమేక్ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హిందీలో బేబీ రీమేక్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ బేబీ సినిమా రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది. గ్రాండ్ గా బేబీ ని హిందీలో రీమేక్ చేసేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా నిర్మాత ఎస్‌.కే.ఎన్‌ పేర్కొన్నాడు అలాగే ఈ రెండిట్లో కొత్త నటీనటులు కాకుండా పేరున్న నటీనటులను నటింపజేయాలని చూస్తున్నట్లు చెప్పారు. బాలీవుడ్ లో కూడా బేబీ మంచి విజయం నమోదు చేస్తుందేమో చూడాలి

 


End of Article

You may also like