Ads
పెళ్లిచూపులు సినిమా తో డైరెక్టర్ గా తన మార్కు చూపించిన తరుణ్ భాస్కర్ వెంటనే ఈ నగరానికి ఏమైంది అనే యూత్ ఫుల్ మూవీ తెరకెక్కించారు.
Video Advertisement
తర్వాత చాలా రోజులు డైరెక్షన్ కి గ్యాప్ ఇచ్చారు. ఈ మధ్యలో టీవీ షోలు, యాక్టింగ్ తో బిజీ అయ్యారు. ఐదేళ్ల తర్వాత ఆయన తర్కెక్కించిన మూవీ కీడా కోలా. చైతన్య రావు ,రాగ మయుర్, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ మూవీ క్రైమ్ జోనర్ లో తెరకెక్కింది.
నవంబర్ మూడో తారీఖున పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం డీసెంట్ హిట్ అందుకుంది. దానికి తగ్గ కలెక్షన్స్ కూడా వచ్చి ప్రాఫిట్ లలో నిలిచింది. అయితే ఈ మూవీలు విడుదలై 40 రోజులు దాటుతున్న ఇంకా ఓటిటి లోకి రాలేదు. అయితే ఈ మూవీ ఓటిటి ప్రసార హక్కులను ప్రముఖ తెలుగు ఓటీపీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ను ఆహా సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 29వ తారీఖున ఈ మూవీ ఆహాలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు. థియేటర్లలో అందర్నీ ఆకట్టుకున్న ఈ మూవీ ఓటిటిలో కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఈ మూవీలో కీలకపాత్రలో తరుణ్ భాస్కర్ కూడా నటించడం విశేషం.
End of Article