Ads
కోలీవుడ్ లెజెండరీ నటుడు విజయ్‌కాంత్ గురువారం నాడు కన్నుమూసిన విషయం తెలిసిందే. 2016 నుండి అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన అవసరమైన చికిత్స తీసుకుంటూ, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల శ్వాస సంబంధిత సమస్యతో హాస్పటల్ లో చేరిన విజయ్‌కాంత్ డిసెంబర్ 12న డిశార్జి అయ్యారు.
Video Advertisement
మంగళవారం నాడు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరగా, కరోనా అని నిర్ధారణ అయ్యింది. వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ తీసుకుంటూ, గురువారం నాడు ఉదయం తుదిశ్వాస విడిచారు. విజయ్‌కాంత్ మరణంతో సినీ, రాజకీయ సెలెబ్రెటీలు ఆయనతో తమకున్న బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నెట్టింట్లో ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఆస్తుల గురించి, అ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కెప్టెన్ విజయ్‌కాంత్‌కు తమిళనాడు ప్రజలందరూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. నేడు ప్రభుత్వ లాంఛనాలతో కెప్టెన్ అంత్యక్రియలు జరుగుతయాని తెలుస్తోంది. కెప్టెన్‌గా ప్రెసిద్ధి పొందిన విజయ్‌కాంత్ 1981లో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, 150కి పైగా సినిమాలలో నటించారు. ఎన్ని హిట్లు అందుకున్న ఆయన ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 2006 లో రాజకీయల్లో అడుగుపెట్టి, పార్టీ స్థాపించి, రాజకీయ నాయకులకు సింహా స్వప్నంగా నిలిచాడు.
2016లో ఉలుందూరుపేట అసెంబ్లీ బియవజికవర్గం నుంచి పోటీ చేసే సమయంలో విజయకాంత్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు 7.6 కోట్లుగా అంచనా వేయబడింది. వీటిలో నగదు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, బాండ్లు, షేర్లు, మోటారు వాహనాలు, ఆభరణాలు మరియు క్లెయిమ్‌లు వంటి ఇతర ఆస్తులు ఉన్నాయి.
విజయ్‌కాంత్ భార్య మరియు ఆయన పై ఆధారపడిన వారి ఆస్తులు సైతం కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ. 14.79 కోట్లు. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వాణిజ్య మరియు నివాస భవనాలు మొదలైన స్థిరాస్తుల విలువ రూ. రూ. 19.37 కోట్లు కాగా, భార్య పేరున ఉన్న ఆస్తుల విలువ రూ. 17.42 కోట్లు. అఫిడవిట్ ప్రకారం స్థిరాస్తుల మొత్తం విలువ రూ. 38.77 కోట్లు అని తెలుస్తోంది. ఆయనకు ఉన్న అప్పుల విలువ రూ. 14.72 కోట్లు. ప్రస్తుతం విజయ్‌కాంత్ ఆస్తుల విలువ 50 – 60 కోట్లు వరకు ఉన్నట్లు సమాచారం.
Also Read: విజయ్‌కాంత్ హీరో నుండి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగారు..? అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు..?
End of Article