Ads
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ప్రధాన పాత్రల్లో నటించే సమయం చాలా తక్కువగా ఉంది అని అంటూ ఉంటారు. ఒక వయసు వచ్చాక చాలా మంది హీరోయిన్లు తల్లి పాత్రలు, అక్క పాత్రలు, వదిన పాత్రలు చేస్తూ ఉంటారు. హీరోయిన్ గా మొదలు పెట్టి, ఎన్నో సంవత్సరాలు హీరోయిన్ గా కొనసాగిన నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో నయనతార ఒకరు.
Video Advertisement
నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా నయనతార సోషల్ మీడియాలో తన అభిమానులకి థాంక్స్ చెప్తూ ఒక పోస్ట్ షేర్ చేశారు. అభిమానుల వల్లే ఈ స్థాయిలో ఉన్నాను అని నయనతార చెప్పారు.
మనసిక్కరే అనే మలయాళం సినిమాతో కెరీర్ ప్రారంభించిన నయనతార, ఆ తర్వాత తమిళ్ లో అయ్యా, చంద్రముఖి, గజిని లాంటి సినిమాల్లో నటించారు. ఇవి నయనతారని తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర చేశాయి. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మి సినిమాలో నటించారు. ఆ తరువాత వరుసగా తెలుగు సినిమాల్లో నటించిన నయనతార, శ్రీరామరాజ్యం సినిమా తర్వాత నుండి సెలెక్టివ్ గా మాత్రమే తెలుగులో కనిపిస్తున్నారు.
ఎక్కువగా తమిళంలో మాత్రమే నయనతార సినిమాలు చేస్తున్నారు. అవి చాలా వరకు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అవుతున్నాయి. దాంతో నయనతార తెలుగు ప్రేక్షకులకు కూడా ఇంకా దగ్గర అయ్యారు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ సంవత్సరం వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు. పాన్-ఇండియన్ భాషల్లో అన్ని సినిమాల్లో నటించి, లేడీస్ సూపర్ స్టార్ అనే పదానికి న్యాయం చేశారు నయనతార.
End of Article