Ads
మాస్ మహారాజు రవితేజ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు ఈ క్రేజీ స్టార్. వెరైటీ కంటెంట్ తో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే రవితేజ కెరియర్లో భారీ హిట్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో రవితేజ.. స్నేహ కాంబినేషన్లో వచ్చిన వెంకీ మూవీ ఒకటి.
Video Advertisement
అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ మూవీ ఇప్పుడు ఎవరన్నా చూస్తారా అన్న అనుమానం నెలకొంది. కానీ ప్రస్తుతం మూవీకి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా డిఫరెంట్ గా ఉంది.
ఈ మూవీకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేసిన మొదటి రోజే 6500 టికెట్లు అమ్ముడుపోయాయి. దీన్నిబట్టి అభిమానులు ఈ మూవీ ని తిరిగి చూడడానికి ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారో ఆలోచించండి. ఇంట్లో చూడలేరు అని కాదు.. కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరు. అందుకే చాలామంది సినిమాలు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తారు. కేవలం హైదరాబాద్ క్రాస్ రోడ్స్ నుంచి ఇంత పెద్ద ఫిగర్ లో టికెట్స్ బుక్ అయ్యాయి.
ఈ మూవీలో కామెడీ తో పాటు థ్రిల్లింగ్ కి కూడా కొదవేలేదు. మరి ముఖ్యంగా గంటకు పైగా సాగే ట్రైన్ సన్నివేశంతో ఈ మూవీ అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంది. మామూలుగా అంత లెంగ్తి షార్ట్ ట్రైన్లో తీయడం అంటే చిన్న విషయం కాదు. ఇందులో హాస్యబ్రహ్మ బ్రాహ్మితో కలిసి హీరో ఫ్రెండ్స్ చేసే రచ్చ ఇప్పటికి కూడా పలు రకాల మిమ్స్ లో మనం చూస్తూ ఉంటాం. ప్రేక్షకులపై ఈ చిత్రం అలాంటి చెరగని ముద్రవేసింది. ఇక సంక్రాంతికి రవితేజ ఈగల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు
End of Article