Ads
ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద గురించి పరిచయం అక్కర్లేదు.అలనాటి అందాల తారగా అందరికీ సురిచితమే.అయితే తాజాగా జయప్రద కనిపించకుండా పోయారు అనే వార్త బయటికి వచ్చింది.ఆమె కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. అమెను అరెస్టు చేయాలనీ అరెస్ట్ వారెంట్ తో యూపీతో పాటు ముంబైలోనూ గాలింపు చర్యలు చేపట్టారు.
Video Advertisement
కానీ జయప్రద ఆచూకీ మాత్రం దొరకడం లేదు. జయప్రదను అరెస్ట్ చేసేందుకు రాంపూర్ ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆమె మిస్సింగ్ అంటూ కథనాలు వచ్చాయి.ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే….?
2019లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి తరపున జయప్రద పోటీ చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలోని నూర్పూర్ గ్రామంలో ఓ రోడ్డును ప్రారంభించారు. అలాగే కెమ్రీలోని పిప్లియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద ఆమెపై రెండు కేసులు నమోదు అయ్యాయి. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో జయప్రద ఓడిపోయింది.
అప్పటి నుంచి రాంపూర్‌లోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో ఈ రెండు కేసులు కొనసాగుతున్నాయి. పోలీసులు ఈ కేసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో జయప్రదను హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కానీ జయప్రద కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా విచారణలకు గైర్హాజరయ్యారు. చివరకు కోర్టు ఆగ్రహించి ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జయప్రదను అరెస్టు చేసి జనవరి 10లోగా హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు యూపీతో పాటు ఢిల్లీ, ముంబైలలో ఆమె కోసం వెతుకుతున్నారు.జయప్రద పోలీసులకి దొరకకపోవడంతో మిసింగ్ అని అంటున్నారు
End of Article