Ads
బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చిన నటుడు శివాజీ. హౌస్ లో ఉన్నప్పుడు ఈయన చూపించిన హుందాతనం చేసిన పెద్దరికం సీజన్ కే హైలెట్ అని చెప్పాలి. పల్లవి ప్రశాంత్ కి శివాజీ చేసిన సపోర్టు చూసి బిగ్ బాస్ ఫాన్స్ అందరూ శివాజీకి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత శివాజీ తనకు తెలిసిన సినీ పెద్దలను కలవడం మొదలుపెట్టాడు.
Video Advertisement
ఇప్పటికే ఆయన నటించిన #90’s వెబ్ సిరీస్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో శివాజీ చాలా బిజీ అయిపోయాడు. మరోవైపు యావర్, పల్లవి ప్రశాంత్ లతో కలిసి ఒక షార్ట్ ఫిలిం తీస్తాను అని చెప్పుకొచ్చాడు శివాజీ. అయితే శివాజీ ఈరోజు డైరెక్టర్ బోయపాటి శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిశాడు. అనంతరం ఆయనకి బొకే అందించి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
వీళ్ళిద్దరి కలయిక వెనక ఏముందో అంటూ అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. వీళ్ళిద్దరికీ ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు జగన్ కి వ్యతిరేకులే,ఇద్దరూ తెదేపా కి సపోర్ట్ చేసే వ్యక్తులే. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతాయి. అలాంటి సమయంలో వీరిద్దరూ కలవడం అనేది అందరికీ ఆసక్తిగా మారింది రాజకీయాల పరంగా కలిసి చర్చించుకుంటున్నారా లేదంటే సినిమాల పరంగా మంతనాలు జరుగుతున్నాయా అనే విషయంపై క్లారిటీ రాలేదు.
ఇక బోయపాటి విషయానికి వస్తే ఈ మధ్యనే తీసిన స్కంద సినిమా ఫ్లాప్ ని మూట కట్టుకుంది తర్వాత బోయపాటి ఏ సినిమాని అనౌన్స్ చేయలేదు కానీ అఖండ టు సెట్స్ మీదకు తీసుకు వెళ్తున్నట్లు సమాచారం అందింది. ఇప్పుడు శివాజీ బోయపాటిని కలిసింది సినిమాలు పరంగా అయితే అఖండ టు లో శివాజీని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
End of Article