ఓటీటీలోకి ఆకాశవాణి స్ట్రీమింగ్.. ఆ విషయంలో ఆహా ముందుంటుంది!

ఓటీటీలోకి ఆకాశవాణి స్ట్రీమింగ్.. ఆ విషయంలో ఆహా ముందుంటుంది!

by Harika

Ads

ఈమధ్య చాలా మంది సినిమాలను, వెబ్ సిరీస్ లను ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేసేస్తున్నారు. అయితే ఇంకొన్ని మంది పక్క లాంగ్వేజ్ వెబ్ సిరీస్లను కూడా తెలుగులోకి డబ్బింగ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. అందులో ఆహా ముందుంటుంది. ఏ లాంగ్వేజ్ లో ఒక మంచి వెబ్ సిరీస్ వచ్చినా వాటిని తెలుగు డబ్ చేసి ఓటీటీలోకి దించేస్తుంది ఆహా. కిందటి సంవత్సరం సామజవరగమన అనే సినిమాలో శ్రీ విష్ణు సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది రెబా మోనికా జాన్.

Video Advertisement

ఇప్పుడు మళ్లీ తెలుగులో ఆకాశవాణి అనే వెబ్ సిరీస్ లో దాదా సినిమా ఫేమ్ కెవిన్ సరసన నటిస్తుంది. కిందటి సంవత్సరం తమిళ ఇండస్ట్రీలో అతి తక్కువ బడ్జెట్ తో నాలుగు కోట్లకు విడుదలైన దాదా సినిమా దాదాపు 30 కోట్ల వరకు సంపాదించి అత్యధిక లాభం తెచ్చిన కోలీవుడ్ సినిమాల లిస్టులో చోటు సంపాదించుకుంది. ఇందులో హీరోగా నటించిన కెవిన్ ఒక తండ్రి పాత్రలో జీవించేసాడు. ఈ సినిమా చూస్తూ అందరిని ఏడిపించేసాడు.

akash vani

ఈ సినిమా హిట్ కావడంతో అందులో ఉన్న హీరో కెవిన్ కు చాలా ఫేమ్ వచ్చి బిజియస్ట్ యాక్టర్ గా మారిపోయాడు. అయితే కిందటి సంవత్సరం తమిళంలో ఆకాశవాణి అనే పేరుతోనే వెబ్ సిరీస్ తీశారు. దాన్నే తెలుగులో అనువదిస్తూ జనవరి 5న ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నారు. ఇందులో మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 నిమిషాలు వరకు ఉంటుందట. ఇందులో పెళ్లి చేసుకుని విడిపోదాం అనుకున్న ఇద్దరూ దంపతులు మళ్లీ ప్రేమికులలా ఎందుకు నటించాల్సి వస్తుందో, అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటో కామెడీ వే లో చూపించారు దర్శకుడు.

ఈ వెబ్ సిరీస్ తమిళ్లో హిట్ అయింద. తెలుగులో ఎలా ఉంటుందో జనవరి ఐదున చూడాల్సి ఉంటుంది. తమిళంలో కెవిన్ కామెడీ టైమింగ్ కు, రెబా మోనికతో తనకున్న కెమిస్ట్రీకు మంచి ఆదరణ పొందాడు. తెలుగులో కూడా అదే అవుతుందో లేదో చూడాలంటే ఆహాలో విడుదలవుతున్న ఆకాశవాణి చూడాలి. ఈ వెబ్ సిరీస్ లో రెబా మోనిక జాన్ కి కూడా మంచి పాత్ర లభించింది. సామజవరగమన సినిమాలో తన నటనని చాటుకున్న రెబా ఇందులో ఎలా ఉంటుందో చూడాలి.


End of Article

You may also like