ఎట్టకేలకు బయటకొచ్చిన గుంటూరు కారం మీనాక్షి చౌదరి లుక్.. అదిరిందయ్యా త్రివిక్రమ్!

ఎట్టకేలకు బయటకొచ్చిన గుంటూరు కారం మీనాక్షి చౌదరి లుక్.. అదిరిందయ్యా త్రివిక్రమ్!

by Harika

Ads

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవ్వటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా.

Video Advertisement

ఇంతకుముందు అతడు, ఖలేజా సినిమాలు వీళ్ళిద్దరి కాంబినేషన్లోని వచ్చాయి ఇప్పుడు రాబోతున్న ఈ గుంటూరు కారం సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.

meenakshi choudhary

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీ లీల మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పటివరకు మహేష్ బాబు ఫస్ట్ లుక్, శ్రీ లీల ఫస్ట్ లుక్ విడుదల చేసిన మూవీ మేకర్స్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ ని మాత్రం రిలీజ్ చేయలేదు దాంతో ఈమె ఎలాంటి క్యారెక్టర్ వేస్తుందో అనే ఉత్కంఠత అభిమానులలో ఉండిపోయింది. అయితే తాజాగా నేడు మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.

అచ్చ తెలుగు లంగా వోణిలో మహేష్ బాబు వెనకనించొని అతని భుజాలు పట్టుకుని ఉన్న మీనాక్షి చౌదరిని చూసిన ప్రేక్షకులు మహేష్ బాబు మరదలు పాత్రలో నటిస్తుంది అంటూ ఒక కంక్లూషన్ కి వచ్చేసారు మీనాక్షి ఫస్ట్ లుక్ అందరికీ తెగ నచ్చటంతో అదిరిందయ్యా త్రివిక్రమ్ అంటూ అతని విజన్ ని తెగ పొగిడేస్తున్నారు అభిమానులు. అయితే మీనాక్షి చౌదరి ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమా ద్వారా తెలుగులోకి వచ్చిన హర్యానా భామ.

మొదట కొన్ని వెబ్ సిరీస్లతో పాటు సీరియల్స్ లో కూడా నటించింది తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మధ్యనే అడవి శేష్ తో హిట్ 2 లో హీరోయిన్గా నటించిన ఈ భామకు ప్రస్తుతం తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. గుంటూరు కారంలో ఈమె పాత్ర గనుక క్లిక్ అయినట్లయితే టాలీవుడ్ కి మరొక మంచి హీరోయిన్ దొరికినట్లే


End of Article

You may also like