Ads
ఈ సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది. ఐదు సినిమాలో రిలీజ్ అవుతుండగా అందులో మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ కూడా ఉంది. ఒక డిఫరెంట్ జోనర్ మూవీ గా దీన్ని తెరకెక్కించారు.
Video Advertisement
ఈగల్ మూవీ నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ విపరీతంగా కట్టుకుంటుంది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఒక కొత్త కంటెంట్ తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది.
పీపుల్స్ మీడియట్ ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హిందీలో కూడా ఈ మూవీ ని రిలీజ్ చేసేందుకు ప్రాణాలకుల రూపొందించారు.అయితే తాజాగా ఈగల్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు జీరో కట్స్ తో U/A సర్టిఫికెట్ జారీ చేసింది.అంటే సినిమాలో పెద్దగా అభ్యంతరం చెప్పే సన్నివేశాలు ఏమీ లేవు అని తెలుస్తోంది. సెన్సార్ కట్స్ కు ఎక్కడ తావివ్వకుండా ప్రణాళికతో సినిమాను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈగల్ సెన్సార్ ఒక విధంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉండబోతున్నట్లు టీజర్ ద్వారానే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా సరికొత్త క్యారెక్టర్ తో సర్ప్రైజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా బాగా వైరల్ అవుతుంది.
ఇంత ముందు నుంచి ఈగల్ మూవీ ని సంక్రాంతికి విడుదల చేస్తామని మూవీ టీం ప్రకటించింది. అయితే తాజాగా ఈగల్ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ విషయం పైన క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. అయితే ఈ మూవీ ఎప్పుడు విడుదలైనా కూడా హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. రవితేజ ఈ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తున్నారు
End of Article