సినిమాలు కళ తప్పేసాయండి..! ఈ గోదారోడి ఆవేదన చూశారా..?

సినిమాలు కళ తప్పేసాయండి..! ఈ గోదారోడి ఆవేదన చూశారా..?

by Mounika Singaluri

Ads

సంక్రాంతి స్పెషల్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు గోదావరి జిల్లా ప్రజలకు సంబరం. అసలు సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాల పండగ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ సంక్రాంతి పండక్కి గోదావరి జిల్లాలకు వెళ్ళిపోతూ ఉంటారు.

Video Advertisement

ఇదివరకు సంక్రాంతి వస్తుందంటే గోదావరి జిల్లాలోని సినిమా ధియేటర్లన్నీ పెళ్లికూతురుల ముస్తాబు అయ్యేవి. సినిమా రిలీజ్ అయ్యే వారం ముందు నుండి థియేటర్ వద్ద ఫాన్స్ హంగామా ఫ్లెక్సీలు కట్టడం ఎలా మామూలుగా ఉండేది కాదు.

a godavari man about sankranti releases

సినిమా టిక్కెట్ల కోసం క్యూలైన్లో కొట్టుకోవడం బళ్ళు కట్టించుకుని మరి సినిమా చూడడానికి వెళ్లడం మొదలు ఆటగా మొదటిది రాత్రి సెకండ్ షో వరకు థియేటర్ కళకళలాడిపోవడం అబ్బో ఆ రోజులు మళ్ళీ వస్తాయా రావో తెలియదు. అయితే ఇప్పుడు గోదావరి జిల్లాలో సంక్రాంతి కళ సినిమా థియేటర్లో తప్పిపోయింది. ఇదివరకు పెళ్లికూతురులో ఉండే థియేటర్ ఇప్పుడు అలంకరణ లేక ఆదరణ కోసం ఎదురుచూస్తుంది.

waltair veerayya 4th week collections..

ఓటిటిలు వచ్చేయడంతో థియేటర్ కి రావడానికి ప్రజలు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. సంక్రాంతి పండుగ ముందుండే సినిమాల కోసం డబ్బులు దాచుకునే రోజుల నుండి ఇప్పుడు జేబు నిండా డబ్బులు ఉన్నా కూడా సినిమా చూడడానికి ఆసక్తి లేని స్థితికి వచ్చేసింది. గోదారి జిల్లాలోకి కూసంత సినిమా పిచ్చి ఎక్కువే. ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే థియేటర్లో మొదటి రోజు చూడకపోతే మాట వచ్చేస్తాదని పట్టుదలతో టిక్కెట్లు సంపాదించి మరి సినిమా చూసేవారు.

common points between mahesh babu trivikram movie and veera simha reddy

మళ్లీ పండగ సమయంలో కుటుంబంతో కలిసి మళ్ళీ రెండోసారి చూసేవారు. కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఇంటిల్లిపాదిని సినిమాకి తీసుకెళ్లడం గోదావరి జిల్లాలో ఆనవాయితీ. బావ మరదిలు, మరదలు ఆటపటిస్తూ కోలాహలంతో ఒకపక్క సినిమా మరోపక్క పండగ గోదావరి జిల్లాకి మకుటం మారేది. పండక్కి సినిమా రిలీజ్ అయింది అంటే ఎన్ని రోజులు ఆడింది రెండు లెక్కలు వేసుకునే స్థాయి నుండి నేడు ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయిన కూడా ఎంత కలెక్ట్ చేసింది అని లెక్కేసుకునే స్థాయికి దిగిపోయింది.

పట్టుమని ఏ సినిమా కూడా పది రోజులు ధియేటర్లో ఉండడం లేదు. థియేటర్ వద్ద టికెట్లు అమ్మేవాడు ప్రొజెక్టర్ ఆపరేటర్ హడావిడి కూడా కనిపించడం లేదు. మళ్లీ ఆ రోజులు వస్తే బాగుండు అంటూ గోదావరి జనాలు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా పండగ అయితే వస్తుంది గాని సినిమా పండగ మాత్రం దూరంగా జరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దయతో మళ్ళీ ఆనాటి రోజులు వస్తే బాగుండు


End of Article

You may also like