Ads
డిసెంబర్ నెలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలు విడుదలయ్యాయి. రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికీ కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్నాయి.
Video Advertisement
అయితే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే చాలు కానీ సినిమా 400 కోట్ల పైబడి కలెక్షన్స్ సాధించింది. మరోపక్క ప్రభాస్ నటించిన సలార్ సినిమా 600 కోట్లు కలక్షన్స్ సాధించింది. అయితే ఈ రెండు సినిమాలకి కూడా 1000 కోట్లు దాటి కలెక్షన్స్ సాధించే సత్తా ఉంది కానీ అలా జరగలేదు. దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని చూస్తే….!
రెండు సినిమాలు కి సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడమే. షారుక్ ఖాన్ డంకీ సినిమాకి వస్తే మేకర్స్ డ్రాప్1, డ్రాప్ 2 అంటూ టీజర్, సాంగ్స్, ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సినిమాని ఆడియన్స్ వద్దకు చేర్చడంలో విఫలమయ్యారు. ఇక ఇదే తప్పును సలార్ మేకర్స్ కూడా చేశారు. తెలుగులో కనీసం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. తెలుగులో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి చేయకపోయినా పర్వాలేదు. కానీ మిగతా భాషలో అలా కాదు కదా.
హిందీలో కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండానే సినిమాని విడుదల చేసేసారు. ఇదే విషయాన్ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తావించారు. సలార్ కి ఉన్న కెపాసిటీకి సరిగా ప్రమోషన్స్ చేసి ఉంటే కలెక్షన్స్ ఇప్పటివరకు వచ్చిన దానికి డబల్ వచ్చేవని చెప్పారు. ఈ తప్పులు చేయకుండా ఉంటే ఈ సినిమాలో రేంజ్ వేరేగా ఉండేది
End of Article