Ads
మామూలుగా భార్యాభర్తలు సంతోషంగా అన్యోన్యంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు కూడా సంతోషంగా సుఖశాంతులతో ఆర్థిక మానసిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా తరచూ భార్యాభర్తలు గొడవ పడడం పోట్లాడుకుంటూ ఉంటే ఆ ఇంటి వాతావరణం కూడా ఎప్పుడో నెగిటివ్ గానే ఉంటుంది. కాగా చాణక్యుడి నీతి శాస్త్రంలో ఆర్థికపరమైన విషయాల గురించి స్నేహబంధం విషయం గురించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి అలాగే వారి మధ్య వచ్చే పోట్లాటల గురించి కుటుంబ సమస్యల గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి.
Video Advertisement
అలాగే రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, జీవితం అనే అంసాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు. వీటిని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు. అదేవిధంగా చాణక్యుడి నీతి శాస్త్రంలో భర్త మరణానికి కారణమయ్యే స్త్రీల గురించి చెప్పబడింది. మరి భర్త మరణానికి కారణం అయ్యే ఆ స్త్రీలు ఎవరో ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎవరైతే దురుసుగా మాట్లాడుతుంటారో, తుంటరి స్త్రీలు, చంచలమైన, దుష్ట స్వభావాలు గల స్నేహితులు ఉన్న ఇంటిలో ఉంటారో అతని మరణం సమీపంలో ఉందని అర్థం. అదే విధంగా చెడు స్వభావం కలిగిన ఆ స్నేహితులను అస్సలు నమ్మకూడదు.
అలాంటి స్వభావం కలిగిన వారు మీకు ఎప్పుడు ద్రోహం చేస్తారు అన్న విషయం కూడా మీకు తెలియదు. మీ కోసం పనిచేసే సేవకుడు లేదా ఉద్యోగి మీకు వ్యతిరేక సమాధానం ఇచ్చినట్లయితే ఎప్పుడైనా మీకు హాని కలిగించవచ్చు. ఒక దుష్ట స్త్రీ నివసించే ఇంట్లో, ఆ ఇంటి యజమాని యొక్క స్థానం చనిపోయిన వ్యక్తికి సమానంగా ఉంటుంది అని చాణక్యుడు తెలిపారు. ఎందుకంటే దుష్ట స్త్రీ పాముతో సమానమని, పాము ఉన్న ఇంట్ల నివసించడం మరణంతో సమానం అని తెలిపారు.
End of Article