ఒకప్పుడు చిన్నచూపు చూసిన కరీనా.. ఇప్పుడు ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది!

ఒకప్పుడు చిన్నచూపు చూసిన కరీనా.. ఇప్పుడు ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది!

by Mounika Singaluri

Ads

ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ ని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త దూరమైన కరీనా కపూర్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి చాలా సంవత్సరాలు తర్వాత నెట్ఫ్లిక్స్ లో జానే జాన్ అనే ఒక మూవీ చేసింది. కానీ అది అంత మంచి రెస్పాన్స్ అందుకోకపోవడంతో కం బ్యాక్ ఇవ్వలేక పోయింది. కానీ రీసెంట్గా కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న కరీనాను నీకు ఇష్టమైన సౌత్ ఇండియన్ యాక్టర్ ఎవరు?

Video Advertisement

ఎవరితో నువ్వు నటించాలనుకుంటున్నావు? అని కరణ్ అడగగా నాకు రాక్ స్టార్ యష్ అంటే చాలా ఇష్టం. కేజిఎఫ్ సినిమా చూసి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. తనతో సినిమా చేయాలనుంది అని చెప్పింది కరీనా కపూర్. అయితే తను అనుకున్నది నెరవేరే రోజు వచ్చేసింది. రాక్ స్టార్ యష్ తాజా చిత్రం టాక్సిక్ లో కరీనా కపూర్ నే మెయిన్ లీడ్ గా అనుకుంటున్నారట మేకర్స్. ఈ మూవీని కరీనా కపూర్ సైన్ చేస్తే ఇదే తన సౌత్ ఇండియాలో ఫస్ట్ సినిమా అవుతుంది.

గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ గ్రోన్ అప్ ఫెయిరీ టేల్ ను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలను చిన్నచూపు చూసిన బాలీవుడ్ సెలబ్రిటీస్ లో కరీనా ఒకరు. ఇప్పుడు అదే సౌత్ ఇండియా సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది కరీనా కపూర్. ఈ విషయానికొస్తే మన సౌత్ ఇండస్ట్రీ చాలా బాగా ఎదిగింది.

బాలీవుడ్ వాళ్ళని సైతం మన వైపు చూపు తిప్పుకొనేల చేసింది. వాళ్ళ దగ్గర మనకు అవకాశాలు ఇవ్వడం ఎంతో కష్టమవుతున్న సమయంలో వాళ్లకే మనం అవకాశాలు ఇచ్చే స్థితిలోకి వచ్చినట్టు ఈ సంఘటన రుజువు చేస్తుంది. మరి ఈ సినిమా గురించి అంతకుమించి ఏ విషయాలు తెలియలేదు. మిగిలిన వివరాలన్నీ త్వరలోనే వస్తాయి అని చిత్రం బృందం ప్రకటించింది.


End of Article

You may also like