500 కోట్ల “ఆదిపురుష్” కంటే… 50 కోట్ల “హనుమాన్” బాగుండడానికి 5 కారణాలు ఇవే.! నిజమే అంటారా.?

500 కోట్ల “ఆదిపురుష్” కంటే… 50 కోట్ల “హనుమాన్” బాగుండడానికి 5 కారణాలు ఇవే.! నిజమే అంటారా.?

by Mohana Priya

Ads

సినిమా రూపొందించే ముందు, ఆ సినిమాకి కొంత బడ్జెట్ అంటూ వేసుకుంటారు. హీరో, డైరెక్టర్ కి ఉన్న బడ్జెట్ ని బట్టి సినిమా నిర్మాణ బడ్జెట్ వేసుకుంటారు. పెద్ద హీరో సినిమాకి ఎక్కువ బడ్జెట్ అవుతుంది. మీడియం హీరో సినిమాకి మీడియం బడ్జెట్.

Video Advertisement

హీరో మీడియం అయినా కూడా, కంటెంట్ బాగా ఉంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి కూడా ఆ నిర్మాత వెనకాడరు. కానీ నిర్మాత పెట్టిన బడ్జెట్ లో ఒక మంచి సినిమా తీయడం అనేది దర్శకుడు చేతిలో ఉంటుంది. అలా ఇటీవల ఒక హీరో రేంజ్ ని చూసి కొన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీస్తే ఆ సినిమా ప్రేక్షకులు ఆదరించలేదు.

బడ్జెట్ ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ విఫలం అయ్యారు. ఇంకొక పక్క, కొంత బడ్జెట్ లో ఒక యంగ్ హీరోతో ఒక దర్శకుడు మంచి క్వాలిటీ ఉన్న సినిమా తీశారు. ఇద్దరు డైరెక్టర్ల కాన్సెప్ట్ ఒకటే. స్టోరీ లైన్ దాదాపు ఒకే లాగా ఉంటుంది. మెయిన్ పాయింట్ కూడా ఒకటే లాగా ఉంటుంది. ఆ ఇద్దరు డైరెక్టర్లు ఎవరో, ఆ రెండు సినిమాలు ఏవో ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటాయి.

ప్రభాస్ లాంటి హీరోని పెట్టి సినిమా తీస్తున్నప్పుడు కొంచెం కూడా జాగ్రత్త లేకుండా ఓం రౌత్ ఏదో చూపించాలని ప్రయత్నం చేసి కామెంట్స్ కి గురి అయ్యారు. ఇప్పుడు తేజ లాంటి యంగ్ హీరోతో ప్రశాంత్ వర్మ 50 కోట్ల బడ్జెట్ తో మంచి గ్రాఫిక్స్ తో ఉన్న సినిమా చేశారు. అసలు ఈ రెండు సినిమాలకి మధ్య ఉన్న తేడాలు ఏంటో, అన్ని కోట్లు పెట్టి తీసిన ఆదిపురుష్ సినిమాలో లేని క్వాలిటీ, హనుమాన్ సినిమాలో ఎలా సాధ్యం అయ్యింది అనేది ఇప్పుడు చూద్దాం.

#1 మొదటిగా మాట్లాడుకోవాల్సింది అవగాహన గురించి. పురాణాల మీద సినిమాలు తీస్తే సరిపోదు. వాటి మీద ఎంత అవగాహన ఉంది అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే పురాణాలు అనేది తరతరాల నుండి హిందూ ధర్మంలో ఒక భాగం అయిపోయింది. దేవుడి మీద సినిమాలు అంటే చాలా సెన్సిటివ్ విషయం. ఎక్కడ కొంచెం లిబర్టీ తీసుకొని డైరెక్టర్ తన పాయింట్ యాడ్ చేసినా కూడా ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే చాలా కామెంట్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకి కూడా జరిగింది అదే. దర్శకుడు పురాణాల మీద కనీస అవగాహన లేకుండా సినిమా తీశాడు అని అన్నారు. మరొక పక్క ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల భావాలని దృష్టిలో పెట్టుకొని దేవుళ్ళని దేవుళ్ళ లాగానే చూపించారు. థియేటర్లలో జైశ్రీరామ్ అనే మంత్రాలు వినిపించాయి అంటే ప్రశాంత్ వర్మ ఎంత బాగా చూపించారో మనమే అర్థం చేసుకోవాలి.

#2 ఆదిపురుష్ సినిమాలో రామాయణంలో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తారు. కానీ వాళ్ళ వేషధారణ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలా చేయాలి అని తీసుకున్న క్రియేటివ్ నిర్ణయం బెడిసి కొట్టింది. రాముడిని నీలమేఘ శ్యాముడు అంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం తెల్లగా చూపించారు. రావణాసురుడి హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఈ సినిమా మీద ఇంత ఎత్తున కామెంట్స్ వచ్చాయి. మళ్లీ చివరిలో ఇదంతా రామాయణం ఆధారంగా తీసిన సినిమా కాదు అని చెప్పారు. ఇలా ముందు ఒక మాట చెప్పి, తర్వాత ఒక మాట చెప్పడం వల్ల సినిమా మీద ఇంకా కామెంట్స్ పెరిగాయి తప్ప తగ్గలేదు.

#3 ప్రమోషన్స్ అనేవి ఏ సినిమాకి అయినా సరే చాలా ముఖ్యమైనవి. ప్రమోషన్స్ అంటే తమ సినిమా ఇలా ఉండబోతోంది అని ప్రేక్షకులకి అర్థం అయ్యేలాగా స్పష్టంగా చెప్పడం. ఆదిపురుష్ సినిమా బృందం నుండి మొదటి నుండి కూడా స్పష్టత లేదు. తాము సినిమాలో ఏం చూపించబోతున్నాం అనే విషయాన్ని ఒక్కచోట అయినా చెప్పలేదు.

minus points in adipurush trailer

కానీ హనుమాన్ టీం అలా కాదు. ప్రతి చోటికి వెళ్లి సినిమాని ప్రమోట్ చేసి, తమ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని క్లియర్ గా చెప్పారు. చెప్పినట్టే సినిమాలో చూపించారు కూడా. కాబట్టి ప్రేక్షకుల అంచనాలు, సినిమాలో చూసినవి బ్యాలెన్స్ అయ్యాయి. సినిమా నుండి ప్రేక్షకులు ఏం ఆశించారో సినిమా బృందం కూడా ప్రేక్షకులకి అదే అందించారు.

#4 హనుమాన్ సినిమా మన తెలుగు సినిమా. పరభాష నటులు ఉన్నా కూడా తెలుగులో తీసిన సినిమా. ఇది వాళ్ళు చెప్పలేదు. అయినా సరే మనకి అర్థం అవుతుంది. కానీ ఆదిపురుష్ సినిమాకి మాత్రం ఈ కన్ఫ్యూషన్ఇప్పటికీ ఉంది. ఇది కేవలం తెలుగు హీరో నటించిన హిందీ సినిమా అన్నట్టు అనిపిస్తుంది. అందుకు కారణం ఇందులో చాలా మంది లిప్ మూమెంట్ హిందీలో ఉంటుంది.

minus points in adipurush trailer

సినిమాని కేవలం తెలుగులో డబ్ చేశారు ఏమో అనిపిస్తుంది. ప్రభాస్ తప్ప మిగిలిన చాలా మంది కొన్ని చోట్ల హిందీ మాట్లాడుతుంటారు. దాంతో మన హీరో సినిమా అని చెప్పుకోవడానికి కూడా కాస్త ఆలోచించారు. ప్రభాస్ నటించిన బాలీవుడ్ సినిమా అనడం నయం ఏమో అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

minus points in adipurush trailer

#5 ఆదిపురుష్ సినిమాని మొదట కొంత బడ్జెట్ తో రూపొందించారు. ఆ తర్వాత వాళ్లు విడుదల చేసిన టీజర్ కి కామెంట్స్ రావడంతో, మళ్లీ సినిమాని వాయిదా వేసి కొన్ని మార్పులు చేశారు. దానికి కూడా చాలా ఖర్చు అయ్యింది. కానీ అదంతా కూడా ఎక్కడా కనిపించలేదు. అంత బడ్జెట్ తో అసలు ఏం చేశారో కూడా అర్థం కాలేదు. కానీ హనుమాన్ సినిమా మాత్రం గ్రాఫిక్స్ లో క్వాలిటీ బాగుంది.

వాళ్లకి ఎంత బడ్జెట్ ఇచ్చారో, దానికి తగ్గట్టే ఫలితం కూడా ఉంది. దాంతో ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత గ్రాఫిక్స్ ఉన్నా సినిమా చేయడం చాలా గొప్ప విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాత ఇచ్చే బడ్జెట్ ని ఎక్కడ ఎంత వాడాలో అక్కడ అంత వాడటం కూడా తెలియడం ఒక సినిమాకి చాలా ముఖ్యమైన విషయం.

minus points in adipurush trailer

ఇవన్నీ మాత్రమే కాదు. అసలు సినిమా చూస్తున్నంతసేపు ఒక భక్తి భావం రావాలి. అప్పుడే అది దేవుడు సినిమా అని అనిపిస్తుంది. హనుమాన్ చూస్తున్నప్పుడు అలాగే జరిగింది. ఇక్కడ మాత్రమే కాదు. నార్త్ లో కూడా చాలా మంది హనుమాన్ సినిమాని అభినందిస్తున్నారు.


End of Article

You may also like