అయోధ్య రామ మందిరానికి ప్రసాదం తయారు చేసే ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

అయోధ్య రామ మందిరానికి ప్రసాదం తయారు చేసే ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

by kavitha

Ads

అయోధ్య రామ మందిరంలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట శుభ సమయం కోసం యావత్ దేశం ఎంతగానో  ఎదురు చూస్తోంది. ఈ కార్యక్రమానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో పాటు దేశంలోని ప్రముఖులు, సాధువులు, లక్షలాది భక్తులు తరలి రానున్నారు.

Video Advertisement

ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రసాదాలకు సైతం ప్రత్యేకత ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీరామ ప్రాణప్రతిష్ట సందర్భంగా పెట్టె ప్రసాదం పై అందరి దృష్టి పడింది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుక కోసం 7 టన్నుల ‘రామ్ హల్వా’ అనే ప్రత్యేక ప్రసాదాన్ని సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. ఆ ప్రసాదాన్ని తయారు చేసే అదృష్టం పొందిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూవులు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జనవరి 22న జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు, వీవీఐపీలు, అయోధ్యకు చేరుకోనున్నారు. ఇకపై అయోధ్య రామాలయం హిందూవులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కానుంది. ఇక ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా 7 వేల కేజీల హల్వాను ప్రసాదంగా తయారు చేయనున్నారు. ఈ ప్రసాద తయారిని విష్ణు మనోహర్ దక్కించుకున్నారు. ఆయనెవరో కాదు దేశంలోనే ప్రముఖ చెఫ్. ఇప్పటికే  విష్ణు మనోహర్ వంటలలో 12 వరల్డ్ రికార్డ్స్ ను సాధించారు.విష్ణు మనోహర్ 1968లో ఫిబ్రవరి 18 నాగ్ పూర్ లోని  బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కుకింగ్ షో యాంకర్ మరియు చెఫ్. విష్ణు మనోహర్‌కి నాగ్‌పూర్, పూణే, ఔరంగాబాద్, ఇండోర్, థానే మరియు కళ్యాణ్ నగరాల్లో రసోయ్ పేరుతో చైన్ రెస్టారెంట్‌ ఉంది. 53 గంటల పాటు వంట చేసి ప్రపంచ రికార్డు సాధించిన ఏకైక చెఫ్‌. 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ‘పొడవైన పరాటా’ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 3 గంటల్లో 7000 కిలోల మహా మిసల్‌ను తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైక చెఫ్‌ మనోహర్‌.
2018 డిసెంబర్ 20న భారతదేశంలో 3200 కిలోల వంకాయలతో వంట చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 3000 కిలోల కిచిడీని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తరువాత ఒక కుండలో 5000 కిలోల కిచిడి చేసిన తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఎన్నో వంటల పుస్తకాలను కూడా రాశారు. తాజాగా 285 నిమిషాలలో అన్నంతో పాటు 75 రకాల డిషెస్ ను తయారు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు రామ మందిర ప్రసాదంను తయారు చేసే బాధ్యతను విష్ణు మనోహర్‌ తీసుకున్నారు. 7000 కిలోల హల్వాను తయారు చేయడం కోసం 1400 కేజీల భారీ కడాయిని నాగ్ పూర్ నుండి అయోధ్యకు తెప్పించారు. ఈ ప్రసాదాన్ని 1.5 లక్షల భక్తులకు పంచిపెట్టనున్నారు.

Also Read: బంగారు పాదరక్షలు మోస్తూ అయోధ్యకు పాదయాత్ర చేస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా.?

 

 


End of Article

You may also like