బంగారు పాదరక్షలు మోస్తూ అయోధ్యకు పాదయాత్ర చేస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా.?

బంగారు పాదరక్షలు మోస్తూ అయోధ్యకు పాదయాత్ర చేస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా.?

by kavitha

Ads

హిందువుల చిరకాల స్వప్నం జనవరి 22న సాకారం కాబోతుంది. శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య  సిద్ధం అవుతోంది. అద్భుతంగా నిర్మితమైన శ్రీ రామమందిరం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది.

Video Advertisement

అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని దశాబ్దాలుగా పోరాటం చేశారు. అక్కడ రాముని గుడి నిర్మిస్తే చూడాలని ఎదురు చూసిన వారెందరో. కొందరు వ్రతాలు, యాగాలు, నోములు చేశారు. అయోధ్యలో రామ మందిరం కోసం రామ భక్తులు ఎవరికి తోచినట్లుగా వారు ఎదురుచూశారు. వారి కలలు నెరవేరే రోజు వచ్చింది. ఈ క్రమంలో ఓ భక్తుడు బంగారు పాదుకలను శిరస్సు పై పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్టకు శుభముహూర్తం ఆసన్నమైంది. రామ భక్తులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తరుణం కొన్ని రోజుల్లోరాబోతుంది. అయోధ్య రామ మందిరంను దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.  రామయ్యకు చాలా మంది భక్తులు భారీగా కానుకలను సమర్పించుకుంటున్న విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా రామయ్యకు బంగారు పాదుకలు సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్ర మొదలు పెట్టారు.
శ్రీనివాస శాస్త్రి హైదరాబాద్‌కు చెందినవారు. అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండర్ కూడా.  రాముడు అయోధ్య నుండి లంకకు నడుచుకుంటూ వెళ్లిన మార్గంలో శ్రీనివాస శాస్త్రి నడుస్తున్నారు. రామేశ్వరంలో మొదలైన ఈ పాదయాత్ర, అరణ్య వాసంలో రాముడు తిరిగిన ప్రాంతాల గుండా వెళ్తున్నారు. దారిలో కంచి, శృంగేరీ, పూరీ, ద్వారకా పీఠాధీశుల ఆశీస్సులు తీసుకుని అయోధ్య వైపుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
64 ఏళ్ళ వయసు ఉన్న శ్రీనివాస శాస్త్రి తలపై బంగారు పాదుకలు పెట్టుకుని అయోధ్యకు ఎనిమిది వేల కిలోమీటర్ల నడుస్తూ,  భక్తిని చాటుకుంటున్నారు. రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటికే ఐదు లక్షల ఇటుకలను దానం చేశారు. శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ. తన తండ్రి రామ భక్తుడని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం చూడాలనేది తన కల అని ఎప్పుడు చెప్పేవారు. తండ్రి కలను నెరవేర్చడం కోసం  బంగారు పాదుకలతో పాదయాత్ర చేస్తూ, అయోధ్యకు వెళుతున్నానని చెప్పుకొచ్చారు.

Also Read: అయోధ్యకు చేరుకున్న రాముని అఖండ జ్యోతి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఒళ్ళు పులకరిస్తుంది!


End of Article

You may also like