“కుష్బూ” నుండి… “సమంత” వరకు… అభిమానులు “గుడి” కట్టిన 10 హీరోయిన్స్..!

“కుష్బూ” నుండి… “సమంత” వరకు… అభిమానులు “గుడి” కట్టిన 10 హీరోయిన్స్..!

by kavitha

Ads

సాధారణంగా సినీ తారలకు అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. వారి సినిమాలు రిలీజ్ అయిన సమయంలో ఫ్యాన్స్ చేసే హడవుడి మామూలుగా ఉండదు. అయితే వీరిలో కొంత మంది ఫ్యాన్స్ అయితే ఆరాధిస్తు ఉంటారు.

Video Advertisement

ఎలా ఆరాధిస్తారు అంటే తమ అభిమాన స్టార్స్ కు ఏకంగా గుడి కట్టే అంతా. అయితే ఎక్కువగా హీరోయిన్లకు గుడులు కడుతుంటారు. ఈ రకంగా అభిమానించడంలో తమిళ అభిమానులు ముందు ఉంటారు. ఈ మధ్య  ఇది తెలుగు ఫాన్స్ కి కూడా పాకింది. తాజాగా సమంతకి ఓ అభిమాని గుడి కట్టాడు. మరి అలా ఇదివరకు ఏ హీరోయిన్స్ కి గుడి కట్టారో చూద్దాం..
1. ఖుష్బూ:

విక్టరీ వెంకటేష్ హీరోగా పరిచయం అయిన కలియుగ పాండవులు సినిమా ద్వారా కుష్బూ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. తర్వాత ఆమె తెలుగు, తమిళంలో చాలా సినిమాలు చేసింది. ఆమె యాక్టింగ్ కి ఫిదా తమిళ ఫ్యాన్స్ ఆమెకి మధురైలో గుడి కట్టారు.
2. నమిత:

సొంతం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నమిత తర్వాత తెలుగుతో పాటుగా కోలీవుడ్ లో అనేక చిత్రాలలో నటించారు. ఆమె నటనను మెచ్చిన తమిళ ప్రజలు నమితకు గుడి కట్టారు. ఇప్పటికి కూడా అక్కడ ఆమెకి అభిమాన సంఘాలు ఉన్నాయి.
3. పూజా ఉమా శంకర్:

పూజా ఉమా శంకర్ శ్రీలంకలోని  కొలంబోకు నటి. ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించింది. ఈమె యాక్టింగ్ నచ్చిన అభిమానులు కొలంబోలో పూజా ఉమా శంకర్ కు గుడి కట్టారు.4. నగ్మా:

నగ్మా  భోజ్‌పురీ సినిమాల పోస్ట‌ర్ గ‌ర్ల్‌గా పాపులర్ అయింది. ఆమె తెలుగు, త‌మిళం, హిందీ సినిమాలలో న‌టించి ప్ర‌ముఖ న‌టిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 90 లలో నగ్మా కున్న క్రేజ్ అంత ఇంతాకాదు.  తెలుగులో అగ్రహీరోల అందరితో నగ్మా నటించింది. ఆమె నటనకు ముగ్దులైన తమిళ ఫ్యాన్స్ ఆమెకు అక్కడ పలు చోట్ల గుడులు కట్టారు.
5. నయనతార:

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన హీరోయిన్ నయనతార. ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తన అందం, నటనతో కోట్లాది మంది ఫ్యాన్స్ సంపాదించుకుంది. ఈమె అభినయానికి ఫిదా అయిన తమిళ ఫాన్స్ ఆమెకు గుడి కట్టాలని అనుకున్నారు. కానీ ఆమె అందుకు నిరాకరించింది.
6. కాజల్ అగర్వాల్:

తెలుగు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు గుడికట్టాలని ఆమె అభిమానులు భావిస్తే కాజల్ వద్దని వారిని రిక్వెస్ట్ చేసిందంట.

7.హన్సిక:
దేశముదురు మూవీతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది హన్సిక. తమిళంలో ఆమెకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్  ఉన్నారు. కొందరు అభిమానులు చెన్నైలో హన్సిక కు గుడిని కట్టారు.
8. నిధి అగర్వాల్:

ఇస్మార్ట్ శంకర్ మూవీతో పాపులర్ అయిన హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమె కోలీవుడ్ లో పలు సినిమాలలో నటించింది. ‘ఈశ్వరన్’ మూవీలో నిధి నటనకు ఫిదా అయిన తమిళ తంబీలు చెన్నైలో నిధి అగర్వాల్ కి గుడి కట్టి, ఆమెకు పాలాభిషేకాలు చేశారు. అప్పట్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.
9. సమంత:

ఇటీవల ఒక అభిమాని హీరోయిన్ సమంతకు గుడి కడుతున్నాడు. ఆమె పై ఉన్న అభిమానంతో బాపట్ల జిల్లాలోని  ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్‌ తన ఇంట్లోనే గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. సమంత పుట్టినరోజున ఈ గుడి ప్రారంభిస్తున్నాడని తెలుస్తోంది.
Also Read: MAHESH BABU: మహేష్ నిజం సినిమాలోని ఈ బాల నటుడు ఎవరో తెలిస్తే షాక్ అవాల్సిందే?


End of Article

You may also like