శ్రీదేవి తన కూతురికి రాసిన ఈ లెటర్ చూశారా..? ఐ లవ్ యు అంటూ..?

శ్రీదేవి తన కూతురికి రాసిన ఈ లెటర్ చూశారా..? ఐ లవ్ యు అంటూ..?

by Mohana Priya

Ads

మన మధ్యలో లేకపోయినా కూడా ఇప్పటికీ ఆమె సినిమాల ద్వారా మనందరికీ దగ్గరగానే ఉన్నారు శ్రీదేవి. శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అనే విషయాన్ని ఇప్పటికి కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటి వరకు సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలని షేర్ చేసిన శ్రీదేవి, మరుసటి రోజు చివరి శ్వాస విడిచారు అనే వార్త వచ్చింది. భారతీయ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆరోజు శోక సంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవిని అభిమానించే నటులు ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఇండస్ట్రీలోనూ శ్రీదేవికి చాలా మంది అభిమానులు ఉన్నారు. శ్రీదేవి అన్ని భాషలు మాట్లాడగలుగుతారు.

Video Advertisement

ఈ కారణంగానే ప్రతి ఇండస్ట్రీ వారు శ్రీదేవిని తమ సొంత నటిలాగా అనుకుంటూ ఉంటారు. బాలీవుడ్ కి వెళ్ళిన సౌత్ హీరోయిన్స్ అప్పట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడికి వెళ్లి, అక్కడ పెద్ద స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో శ్రీదేవి ఒకరు. శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. అయితే శ్రీదేవి తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ కి ఒక సమయంలో ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని ఆ తర్వాత సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ షేర్ చేశారు. అందులో, “ఐ లవ్ యు నా లబ్బు. నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ కూతురివి” అని రాశారు.

sridevi letter to janhvi kapoor

ఇందులో జాన్వీ కపూర్ ని శ్రీదేవి లబ్బు అని పిలిచారు. అది తన ముద్దు పేరు అని తెలుస్తోంది. శ్రీదేవి లేకపోయినా కూడా, తన జ్ఞాపకాలని మాత్రం ఎన్నో సినిమాల రూపంలో, ఫోటోల రూపంలో విడిచి వెళ్లారు. అలాంటి నటి ఎప్పటికీ రారు అనిపిస్తుంది. అంత గొప్పగా నటించేవారు. ఆమె లేకపోయినా కూడా ఆమె సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఇంకా చేరువలోనే ఉన్నారు. భారతదేశ సినిమా ఇండస్ట్రీ అలాంటి నటి ఉన్నందుకు గర్వంగా భావిస్తుంది. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో పాటు, రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. పాటలు కూడా రికార్డ్ చేశారు.

ALSO READ : ప్రేమలు సినిమాలో హీరో పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?


End of Article

You may also like