అయోధ్యకు చేరుకున్న రాముని అఖండ జ్యోతి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఒళ్ళు పులకరిస్తుంది!

అయోధ్యకు చేరుకున్న రాముని అఖండ జ్యోతి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఒళ్ళు పులకరిస్తుంది!

by Mounika Singaluri

Ads

దేశమంతా ఇప్పుడు అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తుంది. జనవరి 22 ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరికొన్ని రోజులలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. శ్రీరాముడి అభిషేక సమయంలో ఐదు కేజీల అఖండ జ్యోతిని వెలిగించనున్నారు. కంప్లీట్ గా వెండితో తయారైన అఖండ దీపం అయోధ్యకు చేరుకుంది. దీనికి శ్రీరామ్ అఖండ జ్యోతి అని పేరు పెట్టారు. శైలేంద్ర సోని అనే భక్తుడు ఐదు లక్షల వ్యయంతో దీన్ని తయారు చేయించారు.

Video Advertisement

ఆఖండ జ్యోతి నిర్మాణంలో 18 గేజ్ వెండి ప్లేట్ ను వాడటం వల్ల ఇది అతి బలంగా ఉంటుంది. ఈనెల 16 నుంచి 22 వరకు అయోధ్య రామ మందిరంలో జరగనున్న రామ్ లల్లా పవిత్రోత్సవంలో శ్రీరామ్ అఖండ జ్యోతిని ఉపయోగించబోతున్నారు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా వారం పాటు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. ఈ అఖండ జ్యోతిని ఒకసారి నెయ్యి నింపి వెలిగిస్తే 72 గంటల పాటు వెలుగుతుంది.

ఈ అఖండ జ్యోతి నుంచి వెలువడే పొగ ఆలయ ప్రాంగణంలోకి వెళ్లకుండా తిరిగి అఖండ జ్యోతి లోపలికి వెళ్లే లాగా తయారు చేశారు. ఈ అఖండ జ్యోతి 25 సంవత్సరాల పాటు పాడవకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు శైలేంద్ర సోని. అలాగే ఈ దీపాన్ని శ్రీరాముడికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు రామ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్.

రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఏడు రోజులపాటు మతపరమైన ఆచారాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా శ్రీరామ అఖండ జ్యోతిని మతపరమైన ఆచారాలలో ఉపయోగిస్తారు. ఈ అఖండ జ్యోతి మాత్రమే కాకుండా అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఇటుకలు దేశం నలుమూలల నుంచి వచ్చాయి అలాగే గంటలు, పళ్లాలు ఇలా ప్రతిదీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చాయి.


End of Article

You may also like