ప్రతి ఏడాది శ్రీరామనవమికి…అయోధ్య బాలరాముడి నుదుటిపైకి సూర్యతిలకం వచ్చేలాగా ఎలా ఏర్పాటు చేసారంటే.?

ప్రతి ఏడాది శ్రీరామనవమికి…అయోధ్య బాలరాముడి నుదుటిపైకి సూర్యతిలకం వచ్చేలాగా ఎలా ఏర్పాటు చేసారంటే.?

by Mohana Priya

Ads

అయోధ్యలోని రామ మందిరంలో మరొక అద్భుతమైన ఘట్టం దర్శనం ఇచ్చింది. నిన్న శ్రీరామనవమి సందర్భంగా గర్భగుడిలో ఉన్న బాల రాముడి నుదుటిమీద సూర్య తిలకం ఏర్పాటు చేశారు. 12 గంటల 16 నిమిషాల సమయంలో దాదాపు 3 నుండి 3.5 నిమిషాల పాటు ఈ సూర్య తిలకం దర్శనం ఇచ్చింది. సూర్యుడి కిరణాలని సూర్య తిలకంలాగా ప్రసరించేలాగా ఏర్పాటు చేశారు. 58 మిల్లీమీటర్ల పరిమాణంలో ఈ సూర్యకిరణాలు ప్రసరించాయి. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన శాస్త్రవేత్తలు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి కోరిక మేరకు, ఇలా శ్రీరామనవమి రోజు సూర్య తిలకం వచ్చేలాగా ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు అయోధ్యలో సూర్య తిలకం దర్శనం జరుగుతుంది.

Video Advertisement

how surya tilak will be visible on every sri ram navami in ayodhya

మరో 19 సంవత్సరాల పాటు ఇలాంటి సూర్య తిలకం ప్రసరించేలాగా ఏర్పాటు చేశారు. ఇందుకోసం బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్- ఐఐఏ లో ఉన్న శాస్త్రవేత్తలని, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు సంప్రదించారు. ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాత ఆలయంలో ఉన్న మూడవ అంతస్తులో నుండి గర్భగుడిలో ఉన్న బాల రాముడి విగ్రహం నుదుటి మీద ఇలాంటి కిరణాలు ప్రసరించేలాగా శాస్త్రవేత్తలు ఒక టెక్నిక్ కనుగొని ఏర్పాటు చేశారు. ఇందుకోసం కొన్ని పైపులు, కొన్ని లెన్స్ లు వాడారు. బెంగళూరులో ఉన్న ఆప్టికా అనే కంపెనీ వీటిని అందించారు. పంచధాతు, అంటే, బంగారం, వెండి, కాపర్, జింక్, ఐరన్ తో వీటిని రూపొందించారు. ఇవి 100 సంవత్సరాల వరకు సురక్షితంగా ఉంటాయి.

how surya tilak will be visible on every sri ram navami in ayodhya

ఈ లెన్స్ ద్వారా సూర్యకిరణాలు గర్భగుడిలోకి వెళ్లేలాగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. రామ మందిరంలోని మూడు అంతస్తులకు పైన భాగంలో సూర్యకాంతిని తీసుకోవడానికి ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఒక పైప్ కనెక్షన్ ఉంటుంది అందులో నుండి సూర్యకిరణాలు వస్తాయి. సూర్యకాంతిని తీసుకోవడానికి ఏర్పాటు చేసిన పరికరం దగ్గరే మరొక పరికరాన్ని కూడా పెట్టారు. ఆ పరికరం వల్ల సూర్యకాంతి తీసుకునే అద్దం 365 రోజుల్లో కొంచెం కొంచెంగా కదులుతూ ఉంటుంది. మళ్ళీ ఏడాది తర్వాత వచ్చే శ్రీరామనవమికి ముందు ఉన్న చోటుకి వచ్చేస్తుంది. ఇది ఏర్పాటు చేసే ముందు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది అనేది చూసి, ఆ ఆధారంగానే ఈ పరికరంలోని పరిమాణాలను ఏర్పాటు చేశారు.

how surya tilak will be visible on every sri ram navami in ayodhya

ఇది 19 సంవత్సరాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పనిచేస్తుంది అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏడాదిలో వాతావరణ మార్పులు చాలా జరుగుతాయి. అవన్నీ కనుగొనేందుకు, వాటి నుండి బయటికి వచ్చే పరిష్కారాన్ని వెతికెందుకు కూడా మరొక వ్యవస్థని ఏర్పాటు చేశారు. గేర్ టీత్ మెకానిజం ద్వారా గడియారంలో ముల్లులు ఎలా అయితే తిరుగుతాయో, అలాగే ఈ వ్యవస్థని కూడా రూపొందించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత నిన్న మొదటిసారిగా సూర్య తిలకం ప్రసరించడం జరిగింది. తర్వాత నుండి కూడా శ్రీరామనవమికి ప్రతిసారి ఇదే ఆనవాయితీ కొనసాగిస్తారు.

watch video :

ALSO READ : సీఐ తిట్టడంతో రాజీనామా చేశాడు… ఇప్పుడు ఏకంగా కలెక్టర్ అయ్యాడు..! ఇతను ఎవరో తెలుసా..?


End of Article

You may also like