సీఐ తిట్టడంతో రాజీనామా చేశాడు… ఇప్పుడు ఏకంగా కలెక్టర్ అయ్యాడు..! ఇతను ఎవరో తెలుసా..?

సీఐ తిట్టడంతో రాజీనామా చేశాడు… ఇప్పుడు ఏకంగా కలెక్టర్ అయ్యాడు..! ఇతను ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

ఇటీవల సివిల్స్ 2023 ఫలితాలు ప్రకటించారు. ఇందులో ప్రకాశం జిల్లాకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి 780 ర్యాంక్ సాధించారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలంలో ఊళ్ళపాలెంకి చెందినవారు. ఉదయ్ కృష్ణారెడ్డి తండ్రి రైతుగా పని చేసే కుటుంబానికి చెందినవారు. వారిది సాధారణమైన నేపథ్యం. ఉదయ్ తల్లి జయమ్మ ఉదయ్ కి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. తండ్రి శ్రీనివాసులు రెడ్డి, నాయనమ్మ రమణమ్మ దగ్గర ఉదయ్ పెరిగారు. ఉదయ్ తండ్రి, ఉదయ్ కి చిన్నప్పటినుండి సివిల్స్ గురించి చెప్తూ ఉండేవారు. ఆ ఆలోచనతోనే ఉదయ్ పెరిగారు.

Video Advertisement

uday krishna reddy civils journey

ఉదయ్ ఇంటర్ చదువుతున్న సమయంలో ఉదయ్ తండ్రి మరణించారు. ఉదయ్ కి ఒక సోదరుడు కూడా ఉన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో, నాయనమ్మ దగ్గర పెరిగారు. ఉదయ్ నాయనమ్మ ఇద్దరు మనవళ్ళని చదివించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఉన్న జవహర్ భారతి కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడు, చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు, 2012 లో పోలీస్ కానిస్టేబుల్ గా నియమితులు అయ్యారు.

uday krishna reddy civils journey

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న గుడ్లూరులో నాలుగేళ్లు, ఆ తర్వాత ఉలవపాడు మండలం రామాయపట్నం మెరైన్‌ స్టేషన్‌లో కొంత కాలం చేశారు. 2019 వరకు ఆ ఉద్యోగం చేశారు. తర్వాత రాజీనామా చేశారు. అందుకు కారణం కూడా ఉంది. ఒకరోజు సీఐ అందరి ముందు ఉదయ్ కృష్ణారెడ్డిని అవమానించారు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుండి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు. నాలుగవ ప్రయత్నంలో విజయం సాధించారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఈ విషయం మీద మాట్లాడుతూ, “60 మంది పోలీసులు ముందు సీఐ అవమానించారు.”

uday krishna reddy civils journey

“నా వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. దాంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెంటనే సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మూడు సార్లు రాశాను. నాలుగవ ప్రయత్నంలో విజయం సాధించాను” అని చెప్పారు. ఉదయ్ కృష్ణారెడ్డికి ఐఏఎస్ క్యాడర్ మాత్రమే కాకుండా, ఐఆర్ఎస్, అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో నియమితులు అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయం మీద కూడా ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు తన ప్రిపరేషన్ ఆపేది లేదు అని అన్నారు. ఐఏఎస్ కి ఎంపిక కావడం తన లక్ష్యం అని పేర్కొన్నారు.

ALSO READ : “మురళి విజయ్”తో ఎఫైర్ పెట్టుకొని భర్తకు విడాకులు… “దినేష్ కార్తీక్” గురించి ఇది తెలిస్తే రియల్ హీరో అంటారు.!


End of Article

You may also like