ఎన్నడూ లేని విధంగా చిలుకూరు గుడి దగ్గర ట్రాఫిక్ జామ్ కావడానికి కారణం ఏంటంటే..? అలా చెప్పడంతోనే..?

ఎన్నడూ లేని విధంగా చిలుకూరు గుడి దగ్గర ట్రాఫిక్ జామ్ కావడానికి కారణం ఏంటంటే..? అలా చెప్పడంతోనే..?

by Harika

Ads

భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో చిలుకూరు పుణ్యక్షేత్రం ఒకటి. ఎంతో మంది భక్తులు చిలుకూరు బాలాజీ స్వామిని సందర్శించుకొని మొక్కుకుంటారు. ఇవాళ చిలుకూరు బాలాజీ గుడి వద్ద ఎంతో మంది భక్తులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. దాదాపు పది కిలో మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. చిలుకూరు బాలాజీ గుడికి వెళ్లే మార్గం మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మాసబ్ ట్యాంక్ నుండి మెహదీపట్నం, నానల్ నగర్, లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్, గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ తో వాహనాలు నిలిచిపోయాయి.

Video Advertisement

traffic jam near chilkur balaji temple

దాంతో ఆఫీసులకు వెళ్లేవాళ్లు, స్కూల్, కాలేజ్ లోకి వెళ్లేవారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. పోలీసులు దిగి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇలా ఇవాళ చిలుకూరు బాలాజీ గుడికి అంత మంది భక్తులు వెళ్లడానికి వెనుక ఒక కారణం ఉంది. అదే గరుడ ప్రసాదం. ఇప్పుడు చిలుకూరు బాలాజీ గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ గారు ఆలయంలోని భక్తులకి గరుడ ప్రసాదం పెడతారు అని చెప్పారు. ఈ గరుడ ప్రసాదం తింటే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పారు.

traffic jam near chilkur balaji temple

ఈ కారణంగానే ఎంతో మంది భక్తులు చిలుకూరు బాలాజీ గుడికి వెళ్తున్నారు. చిలుకూరు బాలాజీ గుడిలో బ్రహ్మోత్సవాలు ఇవాళ నుండి మొదలు అయ్యాయి. ఇప్పటి వరకు 30 వేల మందికి ఈ గరుడ ప్రసాదాన్ని ఇచ్చారు. ఇంకా చాలా మంది భక్తులు కూడా గరుడ ప్రసాదాన్ని స్వీకరించడానికి గుడికి వెళ్తున్నారు. దాంతో రోడ్లు అన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఎంతో మంది ఈ ట్రాఫిక్ జామ్ లో ఉండిపోయారు. సాధారణంగా ఇంత ట్రాఫిక్ జామ్ ఉండడం అనేది ఎప్పుడు జరగదు. అలాంటిది ఈసారి మాత్రం ఎన్నో కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ వల్ల వాహనాలు నిలిచిపోయాయి. ఎన్నో వేల మంది భక్తులు చిలుకూరు బాలాజీ స్వామి గుడిని సందర్శించడానికి తరలివెళ్తున్నారు.

ALSO READ : 17 ఏళ్ల క్రితం మొదటి ఐపీల్ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ లో … ప్రస్తుతం ఆడుతున్న ముగ్గురే ముగ్గురు ప్లేయర్స్ ఎవరంటే.?


End of Article

You may also like