17 ఏళ్ల క్రితం మొదటి ఐపీల్ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ లో … ప్రస్తుతం ఆడుతున్న ముగ్గురే ముగ్గురు ప్లేయర్స్ ఎవరంటే.?

17 ఏళ్ల క్రితం మొదటి ఐపీల్ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ లో … ప్రస్తుతం ఆడుతున్న ముగ్గురే ముగ్గురు ప్లేయర్స్ ఎవరంటే.?

by Mohana Priya

Ads

ఐపీఎల్ మొదలు అయ్యి ఏప్రిల్ 18వ తేదీకి 16 సంవత్సరాలు అయ్యింది. ఈ 16 సంవత్సరాలు క్రికెట్ అభిమానులని ఐపీఎల్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఐపీఎల్ వస్తోంది అంటే మొదటి సీజన్ కి ఎంత ఎదురు చూసారో, ఇప్పుడు కూడా అంతే ఎదురు చూస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఐపీఎల్ కి అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. అందుకే ఐపీఎల్ సీజన్ అని ఐపీఎల్ మొదలు అయ్యే సమయానికి దాని పేరు పెట్టేశారు. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ఇతర దేశాలకు చెందిన ప్లేయర్స్ మనకి దగ్గర అయ్యారు. డేవిడ్ వార్నర్ లాంటి ఎంతో మంది ప్లేయర్స్ ని మనవాళ్లు ఆధార్ కార్డ్ తీసేసుకోమని అడుగుతున్నారు.

Video Advertisement

players who are part of ipl from beginning

అంటే వాళ్లని మన ప్లేయర్స్ లాగా, మన దేశానికి చెందిన ప్లేయర్స్ లాగా భావిస్తున్నారు. ఐపీఎల్ మొదలు అయ్యి 16 సంవత్సరాలు అయ్యింది అంటే ఎవరికి నమ్మబుద్ధి కావట్లేదు. సమయం అంత తొందరగా గడిచిపోయింది. ఈ 16 సంవత్సరాలలో ఐపీఎల్ లో ఎంతో మంది ప్లేయర్స్ వచ్చారు. ఎంతో మంది ప్లేయర్స్ వెళ్లిపోయారు కూడా. కొత్త ప్లేయర్స్ పరిచయమయ్యారు. కానీ కొంత మంది ప్లేయర్స్ మాత్రం ఐపీఎల్ మొదలు అయినప్పటి నుండి, ఇప్పటి వరకు ఆడుతున్నారు. అలా ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుండి, ఇప్పటి వరకు ముగ్గురు ప్లేయర్స్ ఆడుతున్నారు. ఐపీఎల్ మొదటి మ్యాచ్ బెంగళూరులో ఉన్న చిన్నస్వామి స్టేడియంలో జరిగింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి మధ్య జరిగింది. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి ఆడిన వృద్ధిమాన్ సాహ, ఇశాంత్ శర్మ ఇప్పటికి కూడా ఆడుతున్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టుకి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరొక పక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఆడిన విరాట్ కోహ్లీ కూడా ఇప్పటికి అదే జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలా ఐపీఎల్ మొదలైనప్పటి నుండి, ఇప్పటి వరకు ఆడుతున్న ముగ్గురు ప్లేయర్స్ వీళ్లే. నిన్న ఐపీఎల్ మొదలు అయ్యి 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఈ ప్రశ్నని అడిగారు. ఇంకా ఎంతో మంది ఐపీఎల్ కి సంబంధించిన జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. ఎన్నో వీడియోలని షేర్ చేశారు.

ALSO READ : సీఐ తిట్టడంతో రాజీనామా చేశాడు… ఇప్పుడు ఏకంగా కలెక్టర్ అయ్యాడు..! ఇతను ఎవరో తెలుసా..?


End of Article

You may also like