నాలుగేళ్లకే పరుగుల మారథాన్ లో పాల్గొన్న “బుధియా సింగ్” గుర్తున్నాడా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

నాలుగేళ్లకే పరుగుల మారథాన్ లో పాల్గొన్న “బుధియా సింగ్” గుర్తున్నాడా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

by Anudeep

Ads

మనకి ఒక నాలుగైదేళ్ల వయసు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం.. అమ్మని అంటిపెట్టుకొని ఉంటూ.. ఆడుకుంటూ.. నచ్చినవి తింటూ గడిపేవాళ్ళం. కానీ నాలుగేళ్ళ వయసుకే 48 మారథాన్ లు పరిగెత్తాడు రన్నర్ బుధియా సింగ్. ఒడిశా కి చెందిన బుధియా సింగ్ నాలుగేళ్ళ వయసుకే లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నాడు. 2006 లో నాలుగేళ్ళ వయసున్న బుధియా పూరి నుంచి భువనేశ్వర్ కి మధ్య 65 కిలోమీటర్ల దూరాన్ని ఏడు గంటల్లో పరిగెత్తాడు. ఈ చిన్న బాబు ఇండియా కి తదుపరి మిల్కాసింగ్ అని కూడా అందరు కొనియాడారు.

Video Advertisement

కానీ 15 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ఆ తర్వాత అతడి పేరు ఎటువంటి పోటీల్లోనూ వినిపించలేదు. భువనేశ్వర్ లోని భరతపూర్ మురికివాడ లో బుధియా సింగ్ జన్మించాడు. అతడిని 800 వందల రూపాయలకు అతడిని అమ్మేసారు అతని తల్లి. తర్వాత సలియాసాహి స్లమ్డ్‌వెల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన బిరంచి దాస్ అతడిని విడిపించి దత్తత తీసుకున్నారు. బుధియా తల్లి సుకాంతి ఇళ్లల్లో పనులు చేస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఆమె ఆ మురికివాడలో అద్దె ఇంట్లో ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నారు.

did you remember this young marathan runner budhiya..

కానీ చైల్డ్ సెన్సేషన్ బుధియా ప్రస్తుతం ఢిల్లీ లో తన గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. అతడి కోచ్ నుంచి ఒడిశా ప్రభుత్వం వరకు అందరూ బుధియా ని మోసం చేసారని అతడి అక్క రష్మీ తెలిపారు. అందరి నుంచి మోసం ఎదురుకావడంతో బుధియా పరుగుని వదిలేసాడు.. అలాగే ఒడిశా ని కూడా వదిలి దూరంగా ఉంటున్నాడని ఆమె తెలిపారు. అందరూ అతడికి సహకారం అందించి ఉంటె ఇప్పటికి పెద్ద మారథాన్ రన్నర్ అయ్యేవాడని ఆమె పేర్కొన్నారు. అప్పట్లో ప్రభుత్వం ఒక ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది కానీ అది కూడా నెరవేరలేదు అని ఆమె తెలిపారు.

did you remember this young marathan runner budhiya..

బుధియా సింగ్ 65 కిలోమీటర్ల మారథాన్ పరిగెత్తిన తర్వాత ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అతడిని 2007లో స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉంచింది. కానీ ఆ తర్వాత బుధియా అక్కడ ఉండటానికి ఇష్టపడకపోవడం తో తన తల్లి వద్దకు వెళ్ళిపోయాడు. ఇక అక్కడితో బుధియా పరుగుల ప్రయాణం ముగిసింది. 2016 లో బుధియా జీవిత గాథ తో “బుధియా సింగ్-బోర్న్ టు రన్” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం 63వ జాతీయ అవార్డులలో ‘ఉత్తమ పిల్లల చిత్రం’గా నిలిచింది.


End of Article

You may also like