టీమిండియా మాజీ సారథి, ఛేదనలో మొనగాడు, పరుగుల యంత్రం, కింగ్.. ఇలా ఎన్నో పేర్లు ఉన్న విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్ననాటి నుంచే క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న కోహ్లీ.. ఆ దిశగా ఎన్నో కష్టాలకోర్చి సక్సెస్ అయ్యాడు. ఇండియా లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులందరికీ కోహ్లీ సుపరిచితుడే.

Video Advertisement

 

 

అయితే ఒక క్రికెటర్‌గా గొప్ప స్థాయికి ఎదిగిన కోహ్లీ.. చదివింది మాత్రం 12వ తరగతే. ఆ తర్వాత పూర్తి స్థాయిలో క్రికెటర్‌గా మారిపోయిన విరాట్ కోహ్లీ భారత్ తరఫున అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆడి.. యువ భారత్ జట్టుని విజేతగా కూడా నిలిపాడు. ఆ తర్వాత జాతీయ జట్టులోకి వచ్చి రికార్డుల వరద సృష్టిస్తున్నాడు. అయితే తాజాగా విరాట్‌ కోహ్లీ 10వ తరగతి మార్కుల షీటు వెలుగులోకి వచ్చింది. తన కూ అకౌంట్ లో విరాట్ పదో తరగతి మార్కుల షీట్ ను షేర్ చేసాడు.

kohli's 10th marksheet goes viral..!!

అందులో అతనికి మ్యాథ్స్ లో వచ్చిన మార్కులు చూసి షాక్ తినాల్సిందే. చాలా మంది స్టూడెంట్స్ లాగే లెక్కలంటే విరాట్ కు కూడా భయమే అని ఈ మార్కులు చూస్తే తెలుస్తోంది. ఇంగ్లిష్, హిందీ, సోషల్ సబ్జెక్టుల్లో ఫర్వాలేదనిపించినా.. మ్యాథ్స్, సైన్స్ లోనే కోహ్లికి చాలా తక్కువ మార్కులు వచ్చాయి.

kohli's 10th marksheet goes viral..!!

కోహ్లీ కి ఇంగ్లీష్‌లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్ & టెక్నాలజీలో 55, సోషల్ సైన్స్‌లో 81, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 74 మార్కులు వచ్చాయి. ఇదే లిస్ట్ లో కోహ్లీ.. స్పోర్ట్స్ అని రాసి ఉన్న కాలమ్ ను ఖాళీగా వదిలేసి ఈ కామెంట్ చేయడం గమనార్హం. ఈ మార్కుల లిస్టును షేర్ చేస్తూ ‘మీ మార్కుల షీట్లలో ప్రాధాన్యమే ఇవ్వని విషయాలు మీ క్యారెక్టర్ బిల్డ్ చేయడంలో ఎంతగానో తోడ్పడుతుండటం ఫన్నీగా ఉంది..’అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు కోహ్లీ. తర్వాత ఆ పోస్ట్ ని వెంటనే డిలీట్ చేసేసాడు. అయితే అప్పటికే ఈ ఫోటో వైరల్ గా మారింది.