అంత మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ని ఆడించకుండా SRH ఆ ఫ్లాప్ ప్లేయర్‌ని టీమ్‌లో ఎందుకు సెలెక్ట్ చేసారు?

అంత మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ని ఆడించకుండా SRH ఆ ఫ్లాప్ ప్లేయర్‌ని టీమ్‌లో ఎందుకు సెలెక్ట్ చేసారు?

by Harika

Ads

ఎన్నో లక్షల ప్రజల ఆశలతో ఫైనల్ లోకి అడుగు పెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జుట్టు ఐపీఎల్ ఫైనల్ లో ఓడిపోయింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్, మొదటి ఇన్నింగ్స్ తర్వాత వన్ సైడ్ అయిపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మరొకసారి కప్పు సొంతం చేసుకుంది. హైదరాబాద్ జట్టు ఈసారి గెలుస్తుంది అని చాలా మంది ఆశించారు. ప్రతి మ్యాచ్ కూడా చాలా బాగా ఆడడంతో ఈసారి కూడా కప్ కొట్టే అవకాశం ఉంది అని అనుకున్నారు. కానీ ఫైనల్ లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

Video Advertisement

mistake by srh in ipl 2024

కెప్టెన్ పాట్ కమిన్స్ (24; 19 బంతుల్లో, 2×4, 1×6) చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో రసెల్ (3/19) మూడు వికెట్లు, స్టార్క్ (2/14) రెండు వికెట్లు, హర్షిత్ రాణా (2/24) రెండు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత వచ్చిన కోల్‌కతా జట్టు రెండు వికెట్లకి 10.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. వీరిలో వెంకటేశ్ అయ్యర్ (52; 26 బంతుల్లో, 4×4, 3×6) అజేయంగా హాఫ్ సెంచరీ చేశారు. అసలు హైదరాబాద్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఇవే అంటూ విశ్లేషకులు చెప్తున్నారు. అందులో ముందుగా మాట్లాడుకోవాల్సింది జట్టు ప్లానింగ్ గురించి. ఇలాంటి సమయంలో ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. కానీ ఇక్కడే మనవాళ్లు తడబడ్డారు.

అది స్పష్టంగా తెలుస్తోంది. అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్‌ ఆడడంలో విఫలం అయ్యారు. అయినా కూడా వాళ్ళకి ఎక్కువ సార్లు అవకాశాలు ఇచ్చారు. ఒకవేళ సమద్ స్థానంలో సుందర్‌ ని, మార్క్‌రమ్ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్‌ ని పంపించినా కూడా జట్టు గెలిచే అవకాశం ఉండేది. మార్క్‌రమ్ అవుట్ ఆఫ్ ఫామ్ లో కూడా లేరు. అలా అని డ్రాప్ కూడా అవ్వలేదు. ఈ సీజన్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యేలాగానే ఉన్నారు. అయినా కూడా ఒక్కసారి కూడా ఆడడానికి పిలవలేదు.

ఇది టీం చేసిన చాలా పెద్ద తప్పు. ఒక మంచి ప్లేయర్ కి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఇలా జరిగింది అని అంటున్నారు. టీం ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నా కూడా ఇలాంటి మిస్టేక్ ఎలా చేశారు అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి హైదరాబాద్ జట్టు చాలా మంచి ప్లేయర్స్ ఉన్న జట్టుల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అలాంటి జట్టులో ప్లేయర్స్ ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అనేది టీం ఓటమి మీద ప్రభావం చూపింది. అందుకే చివరిలో ఇలా అయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు.


End of Article

You may also like