ఎవరైనా ఒక జంట వారి మధ్య అభిప్రాయభేదాలు వస్తే విడిపోవడం అనేది సహజం. క్రికెట్ రంగంలో కూడా అలా కొంత మంది జంటలు వారి వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 దినేష్ కార్తీక్

దినేష్ కార్తీక్ నిఖిత అనే తన చిన్ననాటి స్నేహితులిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరు విడిపోయారు. 2015 లో ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ తో దినేష్ కార్తీక్ వివాహం జరిగింది. మురళి విజయ్, దినేష్ కార్తీక్ లు మంచి స్నేహితులు. తరచూ దినేష్ ఇంటికి వస్తూ.. వెళ్తూ ఉండే మురళి విజయ్ దినేష్ భార్య నికిత తో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నారు. అయితే..ఈ సంగతి తెలుసుకున్న దినేష్ నిఖితా కు విడాకులు ఇచ్చేసాడు. ఆ తరువాత నిఖిత, మురళి విజయ్ లు పెళ్లి చేసుకున్నారు.

Cricketers who got divorced

#2 వినోద్ కాంబ్లీ

వినోద్ కాంబ్లీ తన స్నేహితురాలు నోయెల్లా లూయిస్ ని వివాహం చేసుకున్నారు. తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆండ్రియా అనే మోడల్ ని పెళ్లి చేసుకున్నారు.

Cricketers who got divorced

#3 శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి నటి ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నారు. ఇటీవల వారిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు.Cricketers who got divorced

#4 మొహమ్మద్ షమీ

మొహమ్మద్ షమీ 2014లో హసిన్ జహాన్ ని పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు చీర్ లీడర్ గా చేసిన హసీన్ జహాన్ పెళ్లయిన తర్వాత తన వృత్తికి వీడ్కోలు పలికారు. కానీ అభిప్రాయ భేదాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.Cricketers who got divorced

#5 షోయబ్ మాలిక్

2002లో అయేషా సిద్ధిఖీ అనే ఒక మహిళను వివాహం చేసుకున్నారు షోయబ్ మాలిక్. తర్వాత వారిద్దరు విడాకులు తీసుకున్నారు. 2010 లో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ని వివాహం చేసుకున్నారు.Cricketers who got divorced

#6 సనత్ జయసూర్య

సనత్ జయసూర్య 1998లో సుముధు అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఒక సంవత్సరానికి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2000 సంవత్సరంలో సాండ్రా ని పెళ్లి చేసుకున్నారు. 2021లో వారిద్దరూ విడిపోయారు.Cricketers who got divorced

#7 జవగళ్ శ్రీనాథ్

ప్రముఖ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్ జోత్స్నా అనే యువతిని వివాహం చేసుకున్నారు. తర్వాత మాధవి అనే జర్నలిస్ట్ ని పెళ్లి చేసుకున్నారు.Cricketers who got divorced

#8 మహమ్మద్ అజారుద్దీన్

మొదట నౌరీన్ అనే మహిళతో మహమ్మద్ అజారుద్దీన్ వివాహం జరిగింది. తరువాత 1996 లో సంగీతా బిజ్లానీ, మొహమ్మద్ అజారుద్దీన్ పెళ్లి చేసుకున్నారు.Cricketers who got divorced

#9 బ్రెట్ లీ

2006లో ఎలిజబెత్ ని పెళ్లి చేసుకున్నారు బ్రెట్ లీ. పెళ్లయిన రెండు సంవత్సరాలకి వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2014లో లానా అండర్సన్ తో బ్రెట్ లీ వివాహం జరిగింది.Cricketers who got divorced

#10 యోగరాజ్ సింగ్

ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కూడా క్రికెటర్. యోగరాజ్ సింగ్, షబ్నం సింగ్ కొడుకు యువరాజ్ సింగ్. తర్వాత వారిద్దరూ విడిపోయారు. యోగరాజ్ సింగ్ మళ్లీ సత్వీర్ కౌర్ అనే ఒక మహిళని పెళ్లి చేసుకున్నారు.

Cricketers who got divorced