క్రికెట్ అనే జెంటిల్మెన్ గేమ్ కు మన దేశంలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత సినిమాలు..నటీనటులకు అంత ఫాలోయింగ్ ఉంటుంది మన దేశం లో. సినిమా, క్రికెట్ ఇవి రెండు మతాలు మనకు. మరీ ఈ రెండూ ఓ చోట చేరితే అంతకన్నా అదృష్టం ఎవరికి ఉంటుంది. అలాగే క్రికెటర్స్, సినీ నటులు ప్రేమలో పడటం, డేటింగ్ చేయడం మనకి తెల్సిందే. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమాయాణం సాగించారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి తమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లారు. ఒక క్రికెటర్, ఒకనాటి ఎప్పటికి మంచి సూపర్ జోడి అని మనకు కొన్ని జంటలు నిరూపించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..

Video Advertisement

#1 మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ – షర్మిళా టాగోర్

ఒక సినిమా తారను ఓ క్రికెటర్ పెళ్లి చేసుకోవడం అనేది మాత్రం వీరిద్దరి నుండి తొలిసారిగా ప్రారంభమైంది. షర్మిల ఠాగూర్ & మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల వివాహం 1969లో జరిగింది. అప్పట్లో వీరి వివాహం దేశ వ్యాప్తంగా బాగా చర్చనీయాంశమైంది. వీరి కుమారుడే సైఫ్ అలీఖాన్.

cricketers who got married to heroines..

#2 అజారుద్దీన్ – సంగీత బిజ్లానీ

మన దేశ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మరియు ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు అజారుద్దీన్. ఆయన 1996లో హిందీ నటి, మిస్ ఇండియా సంగీత బిజ్లానీ ని వివాహం చేసుకున్నారు.

cricketers who got married to heroines..

#3 జహీర్ ఖాన్ – సాగరిక

జహీర్ ఖాన్-సాగరికా జంట 9 నెలల వరకు డేటింగ్ చేసుకుని, ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు.

cricketers who got married to heroines..

#4 హర్భజన్ సింగ్ – గీత బస్రా

హర్భజన్ సింగ్ కూడా బాలీవుడ్ అందాల భామ గీత బస్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ పెళ్లికి ముందే దాదాపు అయిదు సంవత్సరాల పాటు ప్రేమించుకొని తర్వాత 2015 లో వివాహం చేసుకున్నారు.

cricketers who got married to heroines..

#5 యువరాజ్ సింగ్ – హేజెల్ కీచ్

కేరీర్ ఫుల్ ఫేమ్ లో ఉన్నప్పుడు కాన్సర్ బారిన పడ్డాడు యువరాజ్. అమెరికాలో చికిత్స తీసుకొని వచ్చిన తర్వాత హేజెల్ తో పరిచయం అయ్యింది. వీరి వివాహం 2016లో జరిగింది. సల్మాన్ ఖాన్ సినిమా బాడీగార్డ్ లో కనిపించిన హెజెల్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.

cricketers who got married to heroines..

#6 మొహసీన్ – రీనా

పాకిస్తాన్ క్రికెటర్ మొహసీన్ ఖాన్, బాలీవుడ్ నటి రీనా రాయ్ ప్రేమించుకుని ఒకటయ్యారు. కొన్నాళ్ళకు ఈ జంట విడాకులు తీసుకుంది.

cricketers who got married to heroines..

#7 హార్దిక్ పాండ్యా – నటాషా స్టాన్కోవిక్

పాండ్యా వల్లనే లైమ్ లైట్ దక్కించుకుంది నటాషా. వీరి బంధం పెళ్లి వరకూ వెళ్లకపోయినా నిశ్చితార్థం ముగించుకుని ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు.

cricketers who got married to heroines..

#8 విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ

క్రికెట్ లో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ ని ప్రేమించాడు విరాట్. కానీ ఈ జంట ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. అయితే వీటన్నింటిని అధిగమించి నాలుగేళ్ళ తర్వాత విరుష్క జంట 2017లో వివాహ బంధంతో అందరి నోళ్లు మూయించారు. ఈ జంటకు ఒక బిడ్డ ఉంది.

cricketers who got married to heroines..

#9 కె ఎల్ రాహుల్ – అతియా శెట్టి

నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, టీంఇండియా ఆటగాడు కె ఎల్ రాహుల్ ఈ ఏడాది జనవరి 23 న వివాహం చేసుకున్నారు.

cricketers who got married to heroines..