ఈ ఫొటోలో మహేష్ బాబు ధరించిన షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా..?

ఈ ఫొటోలో మహేష్ బాబు ధరించిన షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా..?

by Mohana Priya

Ads

ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇప్పుడు రాజమౌళి సినిమా ప్రిపరేషన్ పనిలో బిజీగా ఉన్నారు, ఈ సినిమా కోసం ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలుపెట్టారు. కానీ వార్తలు ఏవి బయటకి రానీయట్లేదు. మహేష్ బాబు ఈ సినిమా కోసం రకరకాల లుక్స్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా లుక్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయితే మహేష్ బాబు అప్పుడప్పుడు మాత్రమే బయట కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ మహేష్ బాబు మరొక ఫోటో బయటకు వచ్చింది.

Video Advertisement

mahesh babu t shirt cost in recent picture

ఇందులో మహేష్ బాబు తన పబ్లిసిస్ట్ విశ్వ, భార్య నమ్రత శిరోద్కర్ తో కలిసి ఉన్నారు. ఈ ఫోటో మహేష్ బాబు ఇంట్లో తీసిన ఫోటో అని ఫోటో చూస్తుంటే అర్థం అవుతోంది. ఇందులో మహేష్ బాబు వేసుకున్న టీ షర్ట్ గురించి చర్చలు మొదలయ్యాయి. సాధారణంగా హీరోలు ఎలాంటి దుస్తులు వేసుకున్నా సరే అలాంటి స్టైల్ ఫాలో అవ్వాలి అని అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు టీ షర్ట్ చూశాక అలాంటి షార్ట్ కొనుక్కోవాలి అని అందరూ అనుకుంటున్నారు. అందుకే మహేష్ బాబు టీ షర్ట్ ఖరీదు ఎంతో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో ఒకసారి చేస్తే, దాని ఖరీదు తెలిసింది.

mahesh babu t shirt cost in recent picture

టీ షర్ట్ చూస్తే మామూలుగా ఉంది. ఖరీదు కూడా మామూలుగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఈ టీ షర్ట్ ఖరీదు 520 యూరోలు అని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 46,390.22 రూపాయలు. ఈ టీ షర్ట్ ని బెర్లూటి అనే బ్రాండ్ వాళ్లు రూపొందించారు. ఇది మరైన్ బ్లూ కలర్ లో ఉంది. దాంతో ఈ టీ షర్ట్ చూసిన వాళ్ళందరూ కూడా ఖరీదు చూసి ఆశ్చర్యపోతున్నారు. చూడడానికి మామూలుగా ఉన్నా కూడా ధర ఇంత ఉంది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : రాఖీ లో అంత మంచి పాత్రలో నటించిన తర్వాత కూడా మంజూష సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు..? కారణం ఇదేనా..?


End of Article

You may also like