రాఖీ లో అంత మంచి పాత్రలో నటించిన తర్వాత కూడా మంజూష సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు..? కారణం ఇదేనా..?

రాఖీ లో అంత మంచి పాత్రలో నటించిన తర్వాత కూడా మంజూష సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు..? కారణం ఇదేనా..?

by Mohana Priya

Ads

రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అందులో జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలుగా నటించిన మంజూష పాత్రకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమా మొత్తం తన పాత్ర మీదే నడుస్తుంది. ఒక అన్న తన చెల్లెలి కోసం ఎలా కష్టపడతాడు అనేది ఈ సినిమాలో చూపించారు. అలాగే ఒక చెల్లెలు తన అన్నకి చెప్పకుండా ఎన్ని ఇబ్బందులు పడుతుంది అనేది కూడా ఇందులో చూపించారు. ఈ సినిమా చూశాక మంజూషకి చాలా మంది మంచి అవకాశాలు వస్తాయి అనుకున్నారు. తర్వాత మంజూష చాలా సినిమాల్లో నటిస్తారు అని అనుకున్నారు.

Video Advertisement

కానీ అలా జరగలేదు. మంజూష సినిమాలకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు. ఇదే విషయం మీద మంజూష ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడారు. రాఖీ సినిమా తర్వాత తనకి అంత మంచి అవకాశాలు రాలేదు అని అన్నారు. నటనకి పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు రాకపోవడంతోనే సినిమాలు చేయలేకపోయాను అని చెప్పారు. మొహమాటం వల్ల కొన్ని పాత్రలు చేశాను అని అన్నారు. కానీ ఆ పాత్రలు అంత పెద్ద గొప్ప ఏమీ కాదు అని, అందులో తాను నటించినట్టు కూడా చాలా మందికి తెలియదు అని మంజూష అన్నారు. ప్రస్తుతం మంజూష యాంకర్ గా బిజీగా ఉన్నారు. ఎన్నో ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తున్నారు.

reason why manjusha did not acted in movies after rakhee

ఇటీవల జబర్దస్త్ లో కూడా వస్తారు అని ఒక వార్త వచ్చింది. కానీ అది నిజం కాదు. చాలా సినిమా ఈవెంట్స్ కి మాత్రం మంజూష యాంకరింగ్ చేస్తున్నారు. స్టేజ్ షోస్ మాత్రమే కాకుండా, ఇంటర్వ్యూలకి కూడా మంజూష యాంకరింగ్ చేస్తున్నారు. దాంతో సినిమాలకి దూరం అయినా కూడా యాంకరింగ్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి మాత్రం దగ్గరగానే ఉన్నారు. ఇంటర్వ్యూల ద్వారా, టీవీ షోల ద్వారా ప్రేక్షకులని ఎప్పుడూ పలకరిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మంజూష చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని, ఫోటోషూట్స్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటారు. టీవీ ఛానల్స్ చేసే ఇంటర్వ్యూలలో, యూట్యూబ్ ఛానల్స్ చేసే ఇంటర్వ్యూలలో మంజూష యాంకరింగ్ చేస్తూ ఉంటారు.

ALSO READ : 22 ఏళ్ళ శ్రీలీల పక్కన ఆ 52 ఏళ్ళ హీరోనా.? కూతురు లాగా ఉంటుంది కదా అంటూ ట్రోల్స్.!


End of Article

You may also like