22 ఏళ్ళ శ్రీలీల పక్కన ఆ 52 ఏళ్ళ హీరోనా.? కూతురు లాగా ఉంటుంది కదా అంటూ ట్రోల్స్.!

22 ఏళ్ళ శ్రీలీల పక్కన ఆ 52 ఏళ్ళ హీరోనా.? కూతురు లాగా ఉంటుంది కదా అంటూ ట్రోల్స్.!

by Harika

Ads

సాధారణంగా తెలుగు సినిమా హీరోయిన్స్ కి అవకాశాలు తక్కువగా ఉంటాయి అని అంటారు. కానీ ఆ విషయాన్ని తప్పు అని నిరూపించి, వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో శ్రీలీల కూడా ఒకరు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన శ్రీలీల, ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉంది. కానీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు.

Video Advertisement

అయితే శ్రీలీల ఇప్పటి వరకు తెలుగు, కన్నడ సినిమాల్లో మాత్రమే నటించారు. ఇప్పుడు తమిళ్ సినిమాలో కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక స్టార్ హీరో పక్కన నటిస్తున్నారు అనే వార్త వస్తోంది. శ్రీలీల తమిళ్ హీరో అజిత్ పక్కన ఒక సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే వీళ్ళ కాంబినేషన్ మీద కామెంట్స్ మాత్రం రావడం మొదలు అయ్యాయి. శ్రీలీల వయసు 22 సంవత్సరాలు. అజిత్ వయసు 52 సంవత్సరాలు. ఇద్దరికీ మధ్య 30 సంవత్సరాల వయసు తేడా ఉంది.

వయసు తేడా ఉన్నా కూడా అది తెర మీద కనిపించకపోతే బాగానే ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తే వీళ్లిద్దరికి 30 సంవత్సరాలు వయసు తేడా ఉన్నట్టు కనిపిస్తుంది. దాంతో, “వీళ్ళిద్దరూ పక్కపక్కన యాక్ట్ చేయడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది అయితే, శ్రీలీల చూడడానికి అజిత్ కూతురు లాగా కనిపిస్తారు అని కూడా అంటున్నారు. ఏదేమైనా సరే ఇది వార్త మాత్రమే. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే. ఒకవేళ నిజంగా వీళ్లిద్దరూ కలిసి నటిస్తుంటే మాత్రం దాని మీద ఇంకా కామెంట్స్ వస్తాయి. ఇంకా ట్రోల్ కూడా చేసే అవకాశం ఉంది.


End of Article

You may also like