Ads
‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో చాలా మంది కొత్త వారిని తెర పైకి తీసుకువస్తోంది. ఇప్పటి దాకా బుల్లి తెరపై అడుగుపెట్టని ప్రతిభావంతులని వెతికి, వారిలోని ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తుంది.
Video Advertisement
హాస్యాన్ని పండించేవారిని మాత్రమే కాకుండా, డాన్స్, మిమిక్రీ, పాటపాడటం వంటి ఏ ప్రతిభ ఉన్నా శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోత్సహిస్తూ, వారికి గుర్తింపు తీసుకురావడంతో పాటుగా, తమ షోకి మంచి రేటింగ్ ను అందుకుంటోంది. అయితే తాజాగా యూట్యూబ్ లో షేర్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ డ్యాన్స్ వీడియోకి మాత్రం నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈటీవీ శ్రీదేవి డ్రామ కంపెనీ షోకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ షోని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక ఈషో ద్వారా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య గాజువాక లేడి కండక్టర్ ఝాన్సీ పల్సర్ బైక్ సాంగ్ కి డ్యాన్స్ వేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె డ్యాన్స్ వీడియోలు సోషల మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి రష్మి గౌతం యాంకర్ గా చేస్తున్నారు. వారం వారం కొత్త కొత్త థీమ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చే శ్రీదేవి డ్రామ కంపెనీలో హైపర్ ఆది, ఫైమా, సత్య వంటి పలువురు పాల్గొన్నారు. జనవరి 7 న ప్రసారం అయిన శ్రీదేవి డ్రామ కంపెనీలో ఎప్పటిలానే కొందరు సింగర్స్ పాటలు పాడారు. హైపర్ ఆది స్కిట్ వంటివి ఆడియెన్స్ ని అలరించాయి.
అయితే ఈ షోలో నైటీ థీమ్ డ్యాన్స్ లో సత్య, ఫైమా తదితరులు నైటీలు ధరించి వేసిన డ్యాన్స్ వీడియోకి మాత్రం యూట్యూబ్ లో నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. “కొరియోగ్రాఫర్ కు బుద్దిలేదు అనుకుంటే ఆడేవారికి సిగ్గు ఉండక్కర్లేదా. ఆ ఇంద్రజ కు రష్మీకి వేసి ఆడిస్తే ఇంకా మంచి రేటింగ్ వస్తుంది కదా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: “90స్” లో నటించిన ఈ అమ్మాయి… ఆ “నాని” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందా..?
End of Article