ఇలాంటి పాట టాలీవుడ్ లో రాదేమో..! దీని ప్రత్యేకత ఏంటంటే..?

ఇలాంటి పాట టాలీవుడ్ లో రాదేమో..! దీని ప్రత్యేకత ఏంటంటే..?

by kavitha

Ads

ఒక పాటను సృష్టించేది మ్యూజిక్ డైరెక్టర్. ఆ పాట ఎవరు పాడితే బాగుంటుందనే నిర్ణయం ఆ దంగిత దర్శకుడే తీసుకుంటారు. అలా ఎంతోమంది గాయని గాయకులతో పాడించి, తమ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలకు సంగీతాన్ని ఇచ్చినవారు ఎందరో ఉన్నారు.

Video Advertisement

చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తాము స్వర పరిచిన సినిమాలోని పాటలలో ఒక సాంగ్ ని పాడుతుంటారనే విషయం తెలిసిందే. అయితే తెలుగు ఇండస్ట్రీలో పేరుగాంచిన పది మంది సంగీత దర్శకులు కలిసి ఒక పాట పాడితే ఎలా ఉంటుంది. అసలు అలా జరిగే ఛాన్స్ ఉందా అంటే, ఉంది అని చెప్పవచ్చు. మరి ఆ పాట ఏమిటో? ఆ పదిమంది ఎవరో ఇప్పుడు చూద్దాం..
సంగీత దర్శకులు తమ సినిమాలలో ఒకటి లేదా రెండు పాటలు పడడం అందరికీ తెలిసిందే. అయితే ఆర్పీ పట్నాయక్ మాత్రం సినిమాలోని అన్ని పాటలు ఆయనే పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆర్పీ లాగే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా చాలా సినిమాలలో మొత్తం పాటలు పాడారు. అయితే టాలీవుడ్ లో ఈ సినిమా కోసం తెలుగు టాప్ 10 సంగీత దర్శకులు కలిసి ఒక పాటను పాడారు. ఆ సినిమా పేరు అందమైన మనసులో.
సంగీత దర్శకుడిగా ఎన్నో సినిమాలకు పనిచేసిన తరువాత, ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వైపుకు వెళ్లారు. అలా 2008 లో మొదటి సారిగా ‘అందమైన మనసులో’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రాజీవ్, రమ్య నంబీషన్ జంటగా నటించారు. ఈ సినిమాలోని “అమ్మాయి నవ్వింది.. అబ్బాయికి నచ్చింది” అనే పాటను పది మంది ప్రముఖ సంగీత దర్శకులు ఆలపించారు.
ఈ పాటను ఆలపించిన వారిలో ఆస్కార్ గ్రహీత ఎం ఎం కిరవాణి, రాజ్, కోటి, ఎస్ ఏ రాజ్ కుమార్, ఆర్ పి పట్నాయక్, రమణ గోగుల, చక్రి, శ్రీ కొమ్మినేని, వందేమాతరం శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ ఉన్నారు. పది మంది అగ్ర సంగీత దర్శకులు కలిసి పాడటం అనేది ప్రత్యేకమైనది. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పాడటం అరుదైన విషయం అని చెప్పవచ్చు. మళ్ళీ ఇలాంటి పాట తెలుగులో రాదేమో. ఈ పాటకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

https://www.instagram.com/reel/C132KmaJAvE/?igsh=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: “ఛీ!ఛీ! ఇదేం పెర్ఫార్మెన్స్.. ఇంతలా దిగజారిపోయారు ఏంటి..?” అంటూ యూట్యూబ్ లో వీడియోకి కామెంట్స్..!


End of Article

You may also like