Ads
సాధారణంగా ఒక వయసు వచ్చేటప్పటికి పెళ్లి చేసేసుకోవాలి అని, మరొక వయసు వచ్చేటప్పటికి పిల్లలు కనేయాలి అని ఒక ఆలోచన ఉంటుంది. చాలా మందికి ఇది కరెక్ట్ అనిపించినా కూడా, కొంత మంది వీటిని అంత పెద్దగా పాటించరు.
Video Advertisement
ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి అని చెప్పినా కూడా, అలాంటిది ఏమీ లేదు అంటూ చాలా మంది నిరూపించారు. వాళ్లలో కొంత మంది హీరోలు కూడా ఉన్నారు. మగవారికి సాధారణంగా 40 లోపు పిల్లల్ని కనాలి అని అంటారు. కానీ కొంత మంది హీరోలు మాత్రం 50 తర్వాత తండ్రులు అయ్యారు. అలా 50 సంవత్సరాలు దాటాక తండ్రులు అయిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ ఒక మగ బిడ్డకు జన్మని ఇచ్చారు. ప్రకాష్ రాజ్ మొదటి భార్యకి, ప్రకాష్ రాజ్ కి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తర్వాత రెండవ భార్య అయిన పోనీ వర్మ ప్రకాష్ రాజ్ కి 51 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు.
#2 సంజయ్ దత్
సంజయ్ దత్ భార్య మాన్యత ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చారు. సంజయ్ దత్ తనకి 51 ఏళ్ళ వయసున్నప్పుడు తండ్రి అయ్యారు. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు.
#3 బ్రూస్ విల్లిస్
హాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లిస్ 57 సంవత్సరాల వయసులో తండ్రి అయ్యారు. ఆ తర్వాత 59 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కూడా మరొక సారి తండ్రి అయ్యారు.
#4 ప్రభుదేవా
ప్రభుదేవా ఇటీవల తనకి 50 సంవత్సరాలు వచ్చినప్పుడు తండ్రి అయ్యారు. 2020 లో ప్రభుదేవా హిమాని సింగ్ ని పెళ్లి చేసుకున్నారు.
#5 జార్జ్ క్లూనీ
52 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న జార్జ్ క్లూనీ, 56 ఏళ్ల వయసులో కవల పిల్లలకి తండ్రి అయ్యారు. ఆ తర్వాత 58 ఏళ్ల వయసులో కూడా మరొక సారి తండ్రి అయ్యారు.
#6 అల్ పాసినో
83 ఏళ్ల వయసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో అల్ పాసినో తండ్రి అయ్యారు. అల్ పాసినో ప్రియురాలి వయసు 29 సంవత్సరాలు. వీరిద్దరికీ ఇటీవల కూతురు పుట్టింది.
#7 రాజేష్ ఖత్తార్
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ ఖత్తార్ 52 ఏళ్ల వయసులో ఒక కొడుకుని కన్నారు. రాజేష్ ఖత్తార్ భార్య వందన. అంతకుముందు రాజేష్ నటి నీలిమని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇషాన్ ఖత్తార్ జన్మించారు. 2001 లో విడిపోయాక, 2008 లో రాజేష్ ఖత్తార్, వందన సజ్నానిని పెళ్లి చేసుకున్నారు.
#8 మనోజ్ తివారి
నటుడు, రాజకీయవేత్త అయిన మనోజ్ తివారి, తనకు 51 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మూడవ సారి తండ్రి అయ్యారు. ఇప్పటికే వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్లీ మరొక సారి ఆడపిల్ల పుట్టింది.
ఇలా ఈ నటులు అందరూ కూడా 50 ఏళ్లు దాటాక తండ్రులు అయ్యి, పిల్లల్ని కనాలి అంటే వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు.
ALSO READ : రామ్ చరణ్ ని అలా అన్నప్పుడు ఉపాసన లేకపోవడమే వెలితి… ఆహ్వానం అందినా కూడా ఆమె ఎందుకు వెళ్ళలేదు.!
End of Article