ఉత్తరప్రదేశ్ సీఎం యోగితో “హనుమాన్ టీం” ఏం మాట్లాడారు.? ఆ పోస్ట్ లో ఏముంది.?

ఉత్తరప్రదేశ్ సీఎం యోగితో “హనుమాన్ టీం” ఏం మాట్లాడారు.? ఆ పోస్ట్ లో ఏముంది.?

by Mohana Priya

Ads

సంక్రాంతి కానుక విడుదలైన సినిమాల్లో హనుమాన్ సినిమా కూడా ఒకటి. పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అయిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటించారు.

Video Advertisement

ఇంకా ఎంతోమంది ఈ సినిమాల ముఖ్య పాత్రల్లో నటించారు. ఒక సాధారణ వ్యక్తికి శక్తులు వస్తే ఎలా ఉంటుంది అనేది నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉంది. దాని పేరు జై హనుమాన్. హనుమంతుడిని హనుమాన్ సినిమాలో కొంతవరకు మాత్రమే చూపించారు.

uttarpradesh cm with team hanuman

నెక్స్ట్ పార్ట్ జై హనుమాన్ లో సినిమా మొత్తం హనుమంతుడి పాత్ర మీద నడుస్తుంది అని చెప్పారు. అయితే ఇదిలా ఉండగా సినిమా బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ ని కలిశారు. సినిమాకి ఇంత మంచి స్పందన రావడంతో వీళ్లంతా సీఎం కార్యాలయంలో సమావేశం అయ్యి కొంచెం సేపు ముచ్చటించారు. సంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే సినిమాలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో అనే విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు అని ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

సినిమాని చూసిన ఎంతోమంది పెద్దలు కూడా ఇలాగే అభినందిస్తున్నారు. భక్తి సినిమాని చాలా బాగా చూపించారు అని అంటున్నారు. హనుమాన్ సినిమాకి ముందు కొంచెం బడ్జెట్ అనుకున్నారు. కానీ ఆ అనుకున్న బడ్జెట్ లో సినిమాని చాలా బాగా తీశారు అని అందరూ అభినందిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథని రాసుకున్న విధానం కూడా బాగుంది అని అన్నారు. సినిమా విడుదల అయ్యి రెండు వారాలు అయ్యింది. అప్పుడే జై హనుమాన్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు మొదలు పెట్టేసారు. ఇదే విషయాన్ని అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక రోజు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. జై హనుమాన్ సినిమా మొదలుపెట్టాము అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు.

ALSO READ : రామ్ చరణ్ ని అలా అన్నప్పుడు ఉపాసన లేకపోవడమే వెలితి… ఆహ్వానం అందినా కూడా ఆమె ఎందుకు వెళ్ళలేదు.!


End of Article

You may also like