Ads
తెలంగాణ ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ నుండి మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి ఆమె విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనమయ్యారు.
Video Advertisement
ఒకసారి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చూస్తే… యశస్విని రెడ్డి 1997 సంవత్సరంలో హైదరాబాదులో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి, మాధవి. యశస్విని రెడ్డికి ఒక చెల్లెలు కూడా ఉంది. టెన్త్ క్లాస్ వరకు ఎల్బీనగర్ శ్రీ చైతన్య స్కూల్లో చదివారు.
2018 లో హైదరాబాదులోని శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి బిటెక్ పూర్తి చేశారు. తర్వాత 2019 సంవత్సరంలో ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి ల కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డి తో వివాహం జరిగింది. వీరి పెళ్లి సంగీత కార్యక్రమంలో బాహుబలి సినిమాలోని అనుష్క ప్రభాస్ గెటప్పులు వేసి వీరు డాన్స్ కూడా చేశారు. అయితే యశస్విని రెడ్డి రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పాలకుర్తి టికెట్ పౌరసత్వం విషయంలో చిక్కుల రావడంతో ఆ టిక్కెట్ యశస్విని రెడ్డికి దక్కడం ఆమె ఎమ్మెల్యే గా నెగ్గడం జరిగింది.
యశస్విని రెడ్డి భర్త అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. యశస్విని రెడ్డి మామయ్య కార్డియాలజిస్ట్. కొంత కాలం క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యశస్విని రెడ్డి తన పెళ్లి చూపులు ఎలా జరిగాయి అనే విషయాన్ని తెలిపారు. పక్కనే అత్తగారు ఝాన్సీ రెడ్డి కూడా ఉన్నారు. ఈ విషయంపై ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ తన భర్త తరపు వాళ్ళు యశశ్విని రెడ్డి బిల్డింగ్ లో ఉండేవారు అని, అలా వీరి సంబంధం వచ్చింది అని చెప్పారు.
తర్వాత బయోడేటాలు మార్చుకున్నారు అని, అప్పుడు ఫేస్ టైం లో ముందు కుటుంబాలు మాట్లాడుకున్నాక, ఆ తర్వాత యశశ్విని రెడ్డి, రాజారామ్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నారు అని చెప్పారు. వాట్సాప్ లో కాంటాక్ట్ లో ఉన్న తర్వాత కొన్నాళ్ళకి డైరెక్ట్ పెళ్లిచూపులు జరిగాయి అన్నారు. యశశ్విని రెడ్డిని చూడంగానే తన చిన్న కోడలు కుడా ఇంకొక ఝాన్సీ రెడ్డి అనిపించింది అని ఝాన్సీ రెడ్డి తెలిపారు. అయితే తన కొడుకుకి తెలుగు రాదు అని, అక్కడే ఉండడం కారణంగా తెలుగు అంత పెద్దగా రాదు అని ఝాన్సీ రెడ్డి తెలిపారు. అలా వీరి పెళ్లిచూపులు జరిగాయి అన్నారు.
watch video :
ALSO READ : 36 సంవత్సరాల కిందటి “రాయల్ ఎన్ఫీల్డ్” బైక్ బిల్ చూశారా..? అప్పట్లో బైక్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
End of Article