36 సంవత్సరాల కిందటి “రాయల్ ఎన్‌ఫీల్డ్” బైక్ బిల్ చూశారా..? అప్పట్లో బైక్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

36 సంవత్సరాల కిందటి “రాయల్ ఎన్‌ఫీల్డ్” బైక్ బిల్ చూశారా..? అప్పట్లో బైక్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Harika

Ads

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బైకుల్లో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా నడపాలని అనుకుంటారు కొందరు. దీనిని స్టేటస్‌గా భావిస్తుంటారు మరికొందరు. పేరులోనే ఉన్న రాజసాన్ని బైక్‌పై వెళ్తూ చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ బండ్ల ప్రొడ్యూక్టన్ ఎక్కువగా ఉంది కానీ.. కొంత కాలం క్రితం వీటిని చాలా తక్కువగా తయారు చేసేవారు. వీటిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయుల మదిని దోస్తూనే ఉన్నది.

Video Advertisement

ప్రస్తుతం ఈ బండికి కొన్ని టెక్నికల్‌ మార్పులు చేసిన కంపెనీ.. ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 మోడల్‌ను విక్రయిస్తోంది ఆ కంపెనీ. ప్రస్తుతం దాని ధర రూ.2 లక్షల 20 వేలు. అయితే 36 ఏండ్ల కింద దీని ధర ఎంతో తెలిస్తే ప్రతిఒక్కరూ షాకవ్వాల్సిందే.. అప్పట్లో దాని ధర రూ.18,700 లుగా ఉన్న ఒక బిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

royal enfield price in 1986 in india..

జార్ఖండ్‌లోని బొకారోలో సందీప్‌ ఆటో కంపెనీ అనే డీలర్‌ ఈ బైక్‌ను రూ.18,700కు విక్రయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బిల్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. 1986, జనవరి 23న రాసిన ఆ బిల్లును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే అప్పట్లో ఎన్ఫీల్డ్ బైక్ ని ఎక్కువగా సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ కోసం ఇండియన్ ఆర్మీ ఉపయోగించేది. బీయింగ్‌ రాయల్‌ అనే పేరుతో అకౌంట్‌ కలిగిన ఓ వింటేజ్‌ బైక్‌ ఔత్సాహికుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియా లో షేర్‌ అవుతోంది.

royal enfield old bike price

 

అయితే ఇందులో రూ. 250 డిస్కౌంట్ లేదా ఇతరత్రా కారణాల వల్ల తగ్గించడం జరిగింది. అంతే కాకుండా దీనికి రూ. 150 కలిపారు. ఈ బిల్ ప్రకారం 1986 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఖరీదు రూ. 18,700 అని స్పష్టమవుతోంది. ఈ బిల్ కూడా అప్పట్లో చేతి వ్రాత ద్వారా రాయబడింది. అంతే కాకుండా బైక్ మోడల్ బుల్లెట్ 350 సిసి అని ఇందులో గమనించవచ్చు. అయితే ఇప్పుడు ధరలు పోల్చుకుంటే దాదాపు 10 కంటే ఎక్కువ రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.


End of Article

You may also like