Ads
మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పక్కర్లేదు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు చిరంజీవి. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా చిరంజీవి సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి ఇప్పుడు చాలా మందిని చిరు హీరోలుగా చేశారు. అలానే చాలా మంది చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పాత ఫోటోలు కనబడుతూ ఉంటాయి. ఆ పాత ఫోటోలను చూస్తే చాలా మంది అవాక్ అవుతూ ఉంటారు పైగా కనిపెట్ట లేక పోతుంటారు కూడా. హీరోయిన్లు హీరోలు కూడా వాళ్ళ చిన్న నాటి ఫోటోలు వంటివి షేర్ చేస్తూ ఉంటారు. ఆ ఫోటోలని ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఉంటారు.
Video Advertisement
తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఇక మరి ఆ ఫోటో గురించి చూసేద్దాం. ఈ ఫోటో లో ఒక పక్కన చిరంజీవి మరొక పక్క పవన్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళిద్దరితో పాటుగా తెల్ల చొక్కా వేసుకుని ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో మీరు గుర్తుపట్టారా..? ఒకసారి ఫోటోని చూసి కనుక్కోండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు స్టార్ రైటర్ గా వెలుగొందిన దేవి శ్రీ ప్రసాద్ తండ్రి. దేవిశ్రీప్రసాద్ గురించి పరిచయం చేయక్కర్లేదు టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు.
డిఎస్పి తండ్రి సత్య మూర్తి గోదావరి జిల్లా రాయవరం మండలం లోని వెదురుపాక గ్రామం లో జన్మించారు. దేవత సినిమాతో రైటర్ గా మారారు. ఆ తర్వాత ఆయన చాలా సినిమాలకి స్టోరీలు అందించారు. 400 కి పైగా సినిమాలకి రైటర్ గా పని చేశారు. చిరంజీవి హీరోగా వచ్చిన అభిలాష, ఖైదీ నెంబర్ 786, జ్వాలా, ఛాలెంజ్ వంటి సినిమాలకు రైటర్ గా పని చేశారు. గుడుంబా శంకర్, జానీ సినిమాలకు కూడా ఆయన రైటర్ గా పని చేసారు. 2015లో చెన్నైలో కన్నుమూశారు.
End of Article