Ads
భారత దేశ స్వాతంత్య్రం పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన గాంధీజీని నాథూరామ్ గాడ్సే 1948లో జనవరి 30న తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బిర్లా హౌస్‌లో మహాత్మా గాంధీ ప్రార్థనా మందిరంకు వెళ్తున్న సమయంలో నాథూరామ్ గాడ్సే గాంధీజీ కి ఎదురుగా వచ్చి పిస్టల్‌ను తన జేబులోంచి బయటకి తీసి, మహాత్మా గాంధీని 3 సార్లు కాల్చాడు. దాంతో పదిహేను నిమిషాల్లో గాంధీ కన్నుమూశారు.
Video Advertisement
ఘటనా స్థలంలోని సైనికులు గాడ్సేను పట్టుకుని, తుపాకి లాకున్నారు. అంతలోనే ప్రజలు గాడ్సేను చితకబాదారు. ఆ తరువాత గాడ్సేను పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సంఘటనకు ముందు మహాత్మా గాంధీ ఆఖరి రోజు ఎలా గడిచిందో ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, 1948లో జనవరి 30న (శుక్రవారం) ఎప్పటిలానే గాంధీజీ రోజు మొదలయ్యింది. తెల్లవారుఝామున 3:30 గంటలకే నిద్ర లేచారు. ప్రార్థన పూర్తి చేసుకుని, 2 గంటలు కాంగ్రెస్ పార్టీ నూతన బాధ్యతలు మరియు విధానాల పైన దృష్టి పెట్టారు. ఇతరులు లేచేలోపు, 6 గంటలకి గాంధీజీ మళ్ళీ నిద్ర పోయి, 8 గంటలకు లేచారు. ఆ తరువాత నిత్యం లాగే నూనెతో మాలిష్ చేయించుకున్నారు. స్నానం చేసి, మేక పాలు, ఉడికించిన కూరగాయలు తీసుకున్నారు. ముల్లంగి, ఆరెంజ్ జ్యూస్ త్రాగారు.
అయితే అదే టైమ్ కి , డిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ రూమ్‌లో నారాయణ్ ఆప్టే, నాథూరాం గాడ్సే, విష్ణు కర్కరే నిద్రలో ఉన్నారు. బిర్లా హౌజ్ లో గాంధీ అల్పాహారం చేసిన తరువాత, తనని కలిసేందుకు వచ్చిన ఓల్డ్ ఫ్రెండ్ రుస్తమ్ సోరాబజీతో కొంత సమయం మాట్లాడారు.ఆ తరువాత డిల్లీలో ముస్లిం నాయకులను కలిసి ‘మీ సమ్మతి లేకుండా వార్ధా వెళ్ళలేను’ తెలిపారు.గాంధీజీని ఆయన సన్నిహితులు ప్యారేలాల్, సుధీర్ ఘోష్ లండన్ టైమ్స్‌లో ప్రచురించిన ‘నెహ్రూ, పటేల్ మధ్య అభిప్రాయబేధాలు’ అనే వార్త గురించి మాట్లాడమని కోరారు. అందుకు గాంధీజీ సాయంకాలం ఈ విషయం గురించి వారిద్దరి ముందు ప్రస్తావిస్తానని అన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో వల్లభాయ్ పటేల్, తన కుమార్తె మనుబెన్‌తో పాటు గాంధీని కలిసారు. వారు ప్రార్థనా టైమ్ 5 గంటల దాటే వరకూ సంభాషించారు. అయితే మరో వైపు బిర్లా హౌస్‌కి గాడ్సే, అతని స్నేహితులు టాంగాలో బయలుదేరారు. హౌస్‌కి 2 వందల గజాల దూరంలో టాంగా ఆపి, అక్కడే దిగారు.
ఇక్కడ గాంధీజీ వల్లభాయ్ పటేల్‌తో మాట్లాడుతూ, ఒక చేత్తో చరఖా పట్టుకుని, ఇంకో చేత్తో ఆభా తీసుకువచ్చిన భోజనం తినసాగారు. అయితే ప్రార్థనా సభకి లేట్ గా వెళ్ళడం గాంధీజీకి నచ్చేది కాదు. కానీ ప్రార్ధన సమయం అవుతున్నా గాంధీ పటేల్ తో మాట్లాడుతూ ఉన్నారు.వారికి చెప్పలేక ఆభా ఆందోళన పడి, హాల్‌లో ఉన్న జేబు వాచ్ తీసి చూపించడానికి ప్రయత్నించారు. అది చూసిన మనుబెన్ గాంధీకి విషయం చెప్పడంతో ప్రార్థనా సభకు 5.10కి బయలుదేరారు. గాంధీజీ ఆభా, మనులతో నడుస్తూ, వారితో ముచ్చటిస్తూ ప్రార్థనా సభకు వెళ్లారు. అక్కడకు వెళ్ళాక ప్రజలకు గాంధీజీ అభివాదం చేశారు.
ఎడమవైపున ఉన్న నాథూరామ్ గాడ్సే, గాంధీజీ వైపుకి చూసి వంగడంతో, ఆయన పాదాలకు గాడ్సే నమస్కరిస్తాడేమో మనుబెన్ భావించింది. కానీ గాడ్సే మనుని విసురుగా తోసుకుంటూ ముందుకి వెళ్ళాడు. దాంతో ఆమె చేతిలోని మాల, బుక్ కిందపడిపోయాయి. ఆమె వాటికోసం కిందకు వంగారు. సరిగ్గా ఆ సమయంలో గాడ్సే పిస్టల్ తీసి వరుసగా మూడు సార్లు గాంధీ ఛాతీ పైన, పొట్ట పైన కాల్చాడు. గాంధీజీ నోటి వెంట రామ్….రా…మ్” అనే మాటలు వచ్చాయి. మరుక్షణంలో గాంధీజీ శరీరం నేలకొరిగింది.
End of Article