Ads
సోషల్ మీడియా రాకతో సామాన్యులు సైతం సెలెబ్రెటీలుగా మారుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా సినిమా సాంగ్స్ లో అందరి దృష్టి హీరో లేదా హీరోయిన్ల పైనే ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియా వచ్చిన తరువాత ఆ పాటలలో హీరో హీరోయిన్ల పక్కన స్టెప్స్ వేసే సైడ్ డ్యాన్సర్లు కూడా వెలుగులోకి వస్తున్నారు.
Video Advertisement
అలా ఇంతకు ముందు చాలామంది డ్యాన్సర్లు పాపులర్ అయ్యారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరుకారంలో టైటిల్ సాంగ్ లో డ్యాన్స్ చేసిన ఓ అమ్మాయి హైలైట్ అయ్యింది. దాంతో ఆ అమ్మాయి ఎవరా అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. మరి ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరుకారం మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రావు రమేష్ వంటివారు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలోని టైటిల్ సాంగ్ ధమ్ మసాలా ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా వీడియో సాంగ్ రిలీజ్ అయ్యి, ఆకట్టుకుంటోంది. ఈ పాటలో మహేష్ బాబు పక్కన స్టెప్స్ వేసిన ఒక సైడ్ డ్యాన్సర్ హైలైట్ అయ్యింది.
ఆ అమ్మాయి ఎవరా అని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ఫల్గుణి బంగేరా. ఆమె డ్యాన్సర్ మరియు కొరియోగ్రాఫర్. ఆమె ఒమన్‌లో పుట్టి పెరిగింది. ఫాల్గుణి తన కెరీర్ ను కొనసాగించడానికి ఇండియాకి వచ్చారు. బుల్లితెర పాపులర్ డ్యాన్స్ షోలు అయిన ఢీ 10, ఆట 6 జూనియర్స్ లో ఉన్న కొరియోగ్రాఫర్లలో ఆమె కూడా ఒకరు. టాలీవుడ్ టాప్ హీరోల పాటలకు పని చేసింది. టాలీవుడ్ లో శేఖర్ మాస్టర్‌తో కలిసి ఫల్గుణి కొరియోగ్రఫీ చేశారు.
వెంకీ మామా, డియర్ కామ్రేడ్, ఇస్మార్ట్ శంకర్, అలా వైకుంఠపురములో, భీష్మ వంటి సినిమాలకు పనిచేసింది. తమిళ సినిమాలకు కూడా ఫల్గుణి వర్క్ చేసింది. ఎన్నో పాటల్లో కనిపించింది. ఆమె సినిమాల్లో పనిచేయడమే కాకుండా ఆన్‌లైన్ డ్యాన్స్ క్లాసులు కూడా తీసుకుంటుంది. ఆమె యశ్వంత్ మాస్టర్ తో కలిసి అనేక స్టేజ్ షోలు మరియు ప్రత్యేక కార్యక్రమాలలో కనిపించింది. ఆమె ఇక్కడే కాకుండా విదేశాలలో కూడా ప్రత్యేక నృత్య ప్రదర్శనలలో పాల్గొంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఫల్గుణిని ఇన్ స్టాగ్రామ్ లో 163K ఫాలో అవుతున్నారు.
https://www.instagram.com/p/C2Ch_-QP9QF/
Also Read: “ఇడియట్” నుండి… “సరిలేరు నీకెవ్వరు” వరకు… ప్రేమ పేరుతో “అభ్యంతరకరమైన సీన్స్” చూపించిన 8 సినిమాలు..!
End of Article