కేవలం చిరంజీవి విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది..? ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి అన్ని ఎందుకు మాట్లాడుతున్నారు..?

కేవలం చిరంజీవి విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది..? ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి అన్ని ఎందుకు మాట్లాడుతున్నారు..?

by Mohana Priya

Ads

సాధారణంగా ఎవరైనా ఒక మనిషి ఒక స్థాయికి వెళ్ళాక వారికి అభిమానులు ఉంటారు. ఆ మనిషి ఇంకా పెద్ద స్థాయికి వెళ్తే వారిని అభిమానించే వారితో పాటు, వారి మీద కామెంట్స్ చేసే వారు కూడా పెరుగుతూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమా రంగానికి చెందిన వాళ్లు.

Video Advertisement

సినిమా రంగంలో ఎవరైనా సరే ఒక స్థాయికి వెళ్ళాక వారిపై విమర్శలు కూడా పెరుగుతాయి. హీరోల మీద అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుని, అన్ని విమర్శలు ఎదుర్కొన్న హీరో మెగాస్టార్ చిరంజీవి.

ఆయనకి ఎంత మంది అభిమానులు ఉన్నారో, కొంత మంది విమర్శించే వారు కూడా ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా ఆయన ఎలాంటి పని చేసినా కూడా అందులో ఏదో ఒక తప్పు వెతుకుతూ, చిన్నవాటిని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిరంజీవి చేసే ప్రతి పని సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో ఆయన చేసే ప్రతి పనికి ఏదో ఒక వంక పెడుతూనే ఉన్నారు. మిగిలిన హీరోల మీద కామెంట్స్ వచ్చినా కూడా ఇన్ని కామెంట్స్ ఒక్క చిరంజీవి మీద మాత్రమే వస్తాయి.

ఇప్పటికి కూడా వరుసగా సినిమాలు చేస్తూ, తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటారు చిరంజీవి. అసలు ఆయన అలాంటి నటుడు ఉండడం మన ఇండస్ట్రీకి ఒక గొప్ప అదృష్టం. కానీ అలాంటి వ్యక్తి మీద ఇలాంటి కామెంట్స్ ఎందుకు వస్తాయి అనేది మాత్రం తెలియదు. ఈవెంట్స్ లో ఇలా మాట్లాడారు అని, సినిమాల్లో ఇలా అన్నారు అని, బయట ఇలా చేశారు అని, కమర్షియల్ సినిమాలు చేస్తారు అని ఇలా ఏదో ఒక రకంగా చిరంజీవి మీద అయితే ఎప్పుడూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంత వయసులో కూడా తన అభిమానులని సంతోషపెట్టడానికి చిరంజీవి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన కృషికి ఫలితంగా పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతో మంది ఈ విషయం మీద చిరంజీవికి అభినందనలు తెలిపారు. కానీ కొంత మంది మాత్రం చిరంజీవికి అవార్డ్ రావడం ఏంటి అని అంటున్నారు. అంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తికి ఇలాంటి ఒక గుర్తింపు వస్తే ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు. మిగిలిన అందరు నటులకి ఇలాగే జరుగుతుందా అంటే లేదు. కేవలం చిరంజీవి విషయంలో మాత్రమే ఇలా జరుగుతుంది. కానీ ఏదైనా సరే చిరంజీవి మాత్రం తన కృషితోనే పైకి వచ్చారు. ఇంకా పైకి ఎదిగి తెలుగు సినిమాని గర్వించదగ్గ స్థాయిలో నిలబెడతారు.

ALSO READ : “రుద్రవీణ” సినిమా జనాలకి ఎలా అర్ధం అయ్యింది..? ఈ నెటిజెన్ చెప్పిన సమాధానం చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!


End of Article

You may also like