“రుద్రవీణ” సినిమా జనాలకి ఎలా అర్ధం అయ్యింది..? ఈ నెటిజెన్ చెప్పిన సమాధానం చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

“రుద్రవీణ” సినిమా జనాలకి ఎలా అర్ధం అయ్యింది..? ఈ నెటిజెన్ చెప్పిన సమాధానం చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

by kavitha

Ads

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమాలలో ‘రుద్రవీణ’ మూవీ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమాని దర్శక దిగ్గజం కె బాలచందర్ తెరకెక్కించారు. 1988లో వచ్చిన ఈ చిత్రాన్ని బాలచందర్ మెగాస్టార్ ఇమేజ్ కి భిన్నంగా సామాజిక కథాంశంతో తెరకెక్కించారు.

Video Advertisement

అంజనా ప్రొడక్షన్స్ స్థాపించిన మెగా బ్రదర్ నాగబాబు ‘రుద్రవీణ’ ను మొదటి సినిమాగా నిర్మించారు. ఈ మూవీ కమర్షియయల్ గా హిట్ కానప్పటికీ, విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులను అందుకుంది. సినిమాకి ఎన్నో ప్రశంసలు వచ్చినా కూడా దాదాపు అప్పట్లోనే 60 లక్షల లాస్ వచ్చింది. దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయితే కోరాలో ‘ఇప్పటి సమాజానికి రుద్రవీణ సినిమా ఏ విధంగా అర్ధం అవుతుంది’ అనే ప్రశ్నకి ఒక యూజర్ ఇచ్చిన సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. rudraveenaమెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రుద్రవీణ’ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ప్రముఖ తమిళ నటుడు జెమిని గణేశన్ కీలక పాత్రలో నటించాడు. అన్ని ప్రశ్నలకి జవాబు దొరికే కోరాలో ‘ఇప్పటి సమాజానికి రుద్రవీణ సినిమా ఏ విధంగా అర్ధం అవుతుంది’ అని అడిగిన ప్రశ్నకి ప్రకాష్ అనే యూజర్ ఇలా చెప్పుకొచ్చారు. ‘మద్యపానంను మానిపించటం అనేది మూవీలో చూపించినంత సులభం కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాలకు పైగా దేశంలో, రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగ గణాంకాలను ప్రత్యేకించి చూపించనవసరం లేదేమో. ప్రస్తుతం ఉన్న సొసైటీ ఆ సన్నివేశాలను చూసి నవ్వుకుంటారేమో, భార్య పిల్లలను పట్టించుకోనివారు, ఎవరో వివాహం చేసుకోకుంటే మద్యం తాగడం మానేస్తాము అంటే అది జరగని విషయం, అందువల్ల మద్యం లేని సొసైటిని ఆశించడం పక్కన పెడదాం.రుద్రవీణ మూవీలోని ముఖ్యమైన సమస్య అంటరానితనం. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ బిలహరి బాబాయ్ ఏమ్మా శోభన(లలిత)ను నువ్వు అంటరానిదానివి కదా అని ప్రశ్నిస్తే, కొంచెం బాధపడినా, ఏ అంటుకోవచ్చుగా అంటూ కొట్టినట్టుగా జవాబు చెప్తుంది. ఆ సన్నివేశం చిన్నతనంలో చూసి ఓహో ఇలానే ఉండాలని అనుకునేవాడిని, అలా చెప్తేనే ఊరుకుంటారని నమ్మేవాడిని.అయితే ఆ మూవీ 80ల ఆఖరిలో వచ్చిన మూవీ కదా, ప్రస్తుతం అంటరానితనం ఏముంది అనుకుంటున్నారా? ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ చూసి ఆ మూవీలో చేసినట్లు రియల్ లైఫ్ లో ప్రయత్నిస్తే 30 సంవత్సరాల అనంతరం కూడా సమస్యే అని ఋజువైంది’ అని వెల్లడించారు.

Also Read: “ఐదుగురు వచ్చి దాడి చేశారు..!” అంటూ… “రాకేష్ మాస్టర్” భార్య కామెంట్స్..? ఏం జరిగిందంటే..?


End of Article

You may also like