Ads
ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని సినిమాలు వచ్చినా మదర్ సెంటిమెంట్ సినిమాలకి మాత్రం ఆదరణ ఒకటే రకంగా ఉంటుంది. అందుకే ఇప్పటికి కూడా చాలా మంది డైరెక్టర్లు అమ్మ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ మీద సినిమాలు తీస్తూ ఉంటారు.
Video Advertisement
అయితే ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. ఇటీవల ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్ లో కూడా మదర్ సెంటిమెంట్ ఉంది. ప్రభాస్ తల్లి పాత్రని ఈశ్వరీ రావు పోషించారు. ప్రభాస్ తల్లి పాత్రలో ఆమె నటన చాలా బాగుంది. అయితే దీని మీద కామెంట్స్ కూడా అదే రకంగా వచ్చాయి.
ఈ సినిమాలో ఒక సీన్ లో ప్రభాస్ ఒక ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటే ఈశ్వరి రావు భయపడి ఆ కత్తి తీసేయమని చెప్తారు. ఈ సీన్ మీద కామెంట్స్ వచ్చాయి. అసలు ఒక ప్లాస్టిక్ కత్తికి అంత రియాక్షన్ ఇవ్వవలసిన అవసరం ఏం ఉంది అని అన్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, హీరో తల్లికి ట్రామా ఉంటుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల ప్రభావం ఆమె మీద పడి ఆమెకి గొడవలు అంటే భయం వస్తుంది. అందుకే ఫ్లాష్ బ్యాక్ లో కూడా వరద దేవా కోసం వచ్చినప్పుడు ముందు వద్దు అని చెబుదాం అనుకొని తర్వాత వెళ్ళమని చెప్తుంది.
పక్కన ఒక వ్యక్తి టైర్ మీద మేకులు కొడుతుంటే కూడా ఆమెకి తలుపుకి మేకులు కొడుతున్న సీన్ గుర్తుకి వచ్చి ఒక్క క్షణం ఆలోచిస్తుంది. ఆమె భర్తని కోల్పోయిన కొంత సేపటికి ఎవరో తెలియని వాళ్ళు వచ్చి తనని ఇబ్బంది పెడతారు. అప్పుడు వరద వచ్చి వాళ్ళని కాపాడతాడు. ఆ కారణంగానే మళ్లీ అన్ని సంవత్సరాల తర్వాత దేవాని వరద వచ్చి హెల్ప్ అడగంగానే వెళ్ళమని చెప్తుంది.
ఆ తర్వాత జరిగిన సంఘటనల వల్ల గొడవలు అంటే ఇంకా భయం ఏర్పడడంతో హీరోని గొడవల జోలికి వెళ్లొద్దు అని అంటుంది. కానీ ప్రేక్షకులు ఏమో ఆమె పడే బాధని పట్టించుకోవడం మానేసి కత్తిని చూసి అంత చేసింది అని అన్నారు. నెక్స్ట్ పార్ట్ లో అయినా ఆమె అలా రియాక్ట్ రావడానికి సరైన కారణాలు చూపెడతారు ఏమో చూడాల్సిందే.
End of Article