Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా ఇటీవల విడుదల అయ్యింది. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో దూసుకుపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.
Video Advertisement
శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, జగపతిబాబు వంటి వాళ్ళు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో విడుదల చేస్తున్నారు.
కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొదట ఈ పాట మీద కామెంట్స్ చేసిన వాళ్ళు సినిమాలో ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లలో డాన్సులు వేశారు. పేపర్లు ఎగిరేశారు. ఈ పాటలో మహేష్ బాబు స్టెప్స్ కూడా ప్రేక్షకులకు బాగా అనిపించాయి. అసలు మహేష్ బాబు అంత డాన్స్ చేయడం చాలా సంవత్సరాల తర్వాత జరిగిన విషయం ఏమో. అప్పుడెప్పుడో అర్జున్ లాంటి సినిమాలో మహేష్ బాబు డాన్స్ వేశారు.
ఆ తర్వాత ఖలేజా, దూకుడు సినిమాలో కూడా మహేష్ బాబు కొన్ని పాటలకు డాన్స్ వేశారు. సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి మహేష్ బాబు సినిమాలో ఒక డాన్స్ పాట ఉండేలాగా చూసుకుంటున్నారు. ఈ సినిమాలో కూడా అలాగే మూడు పాటలకు డాన్స్ వేశారు. ఈ పాటని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో పాటలు అన్నిటికీ కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ పాట కుర్చీ మడతపెట్టి కావడంతో కుర్చీతో ఒక స్టెప్ ఉంటుంది.
ఈ స్టెప్ సింగిల్ టేక్ లో ఉంటుంది. అయితే ఈ స్టెప్ మహేష్ బాబు వేస్తున్నప్పుడు కుర్చీ కొంచెం జరుగుతుంది. అయినా కూడా మహేష్ బాబు తడబడకుండా డాన్స్ వేశారు. ఇది పొరపాటు కాదు. కానీ సాధారణంగా హీరోలు ఏదైనా ఒక ప్రాపర్టీ తో డాన్స్ వేస్తున్నప్పుడు అది పడిపోవడం, లేదా ఉన్న స్థానం నుండి జరగడం వంటివి అవుతూ ఉంటాయి. కొన్ని పాటల్లో అయితే ఆ పాటలు డాన్స్ వేస్తున్న వారి షూ ఊడిపోవడం, లేదా వారి వస్తువు ఏదైనా కింద పడిపోవడం వంటివి కూడా అవుతూ ఉంటాయి. కానీ ఆ హీరో అలాంటి చిన్న చిన్నవి కనిపించకుండా తన డాన్స్ తో ప్రేక్షకులని ఎలా చూపు తిప్పనియ్యకుండా చేశారు అనేది ముఖ్యమైన విషయం.
ఈ పాటలో అలాగే జరిగింది. కానీ మహేష్ బాబు డాన్స్ తో అది కవర్ చేశారు. మహేష్ బాబు ఆ స్టెప్ కోసం ఒత్తిడి అంతా కుర్చీ మీద పెట్టి వేస్తున్నారు. దాని పొజిషన్ కొంచెం మారినా కూడా స్టెప్ అటూ ఇటూ అయ్యే అవకాశం ఉంది. కాలు కూడా జారే అవకాశం ఉంది. కానీ మహేష్ బాబు అవి ఏమీ పట్టించుకోకుండా కుర్చీ జరిగినా కూడా స్టెప్ కరెక్ట్ గా వేశారు. పాట చూసిన వాళ్ళు అందరూ కూడా మహేష్ బాబు డాన్స్ బాగుంది అని అంటున్నారు. ఈ ఒక్క పాట మాత్రమే కాదు ఈ సినిమాలో మహేష్ బాబు ప్రతి పాటలో వేసిన డాన్స్ డాన్స్ ని మెచ్చుకుంటున్నారు.
watch video :
ALSO READ : గుంటూరు కారం “దమ్ మసాలా” పాటలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే..?
End of Article