Home Filmy Adda పార్ట్ -1 ఫ్లాప్… కానీ పాన్-ఇండియన్ రేంజ్ లో సీక్వెల్ ప్లాన్ చేశారు..! ఈ సినిమా ఏంటో తెలుసా..?

పార్ట్ -1 ఫ్లాప్… కానీ పాన్-ఇండియన్ రేంజ్ లో సీక్వెల్ ప్లాన్ చేశారు..! ఈ సినిమా ఏంటో తెలుసా..?

by Mohana Priya

సాధారణంగా ఏదైనా ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ రావడం అనేది కామన్. కానీ ఇప్పుడు ఒక సినిమా మాత్రం ఫ్లాప్ అయినా కూడా దానికి సీక్వెల్ వస్తోంది. ఆ సినిమా వచ్చి కూడా దాదాపు ఏడు సంవత్సరాలు అయ్యింది. ఆ సినిమా పేరు మాయావన్.

ఈ సినిమాని తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించారు. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించారు.

this sundeep kishan movie to have a big sequel

బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. సినిమా ఫ్లాప్ అయినా కానీ చాలా మంది ఈ సినిమా ఒక మంచి ప్రయోగం అని అన్నారు. నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆసక్తితో సినిమా అంతా నడుస్తుంది. ఈ సినిమాకి సీక్వెల్ తీయడం అనేది మంచి విషయమే. ఎందుకంటే సినిమా ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయినా కూడా టాక్ పరంగా మాత్రం మంచి టాక్ సంపాదించుకుంది.

this sundeep kishan movie to have a big sequel

ఈ సినిమాకి సివి కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ పోలీస్ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా సీక్వెల్ కూడా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కోసం దాదాపు 45 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం. అది కూడా ఈసారి పాన్-ఇండియన్ రేంజ్ లో సినిమా విడుదల చేయబోతున్నారు. సందీప్ కిషన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ఇదే ఏమో.

this sundeep kishan movie to have a big sequel

ప్రస్తుతం ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా రికవరీ ఎంత వరకు చేస్తుంది అనేది తెలియదు. కానీ సినిమా మొదటి భాగానికి కథ పరంగా మంచి స్పందన రావడంతో అదే ధైర్యంతో సినిమా బృందం ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ని భారీ ఎత్తున ప్లాన్ చేశారు. సినిమా అనౌన్స్ చేశారు కానీ ప్రస్తుతం అయితే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. మరొక పక్క సందీప్ కిషన్ రాబోతున్న నెక్స్ట్ సినిమా అయిన ఊరి పేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

ALSO READ : ఈ 8 మంది “తెలుగు” టాప్ హీరోలతో నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?

You may also like